Ten Rupee Note: మీ దగ్గర రూ.10 పాత నోటు ఉందా..? అయితే మీరు ఇట్టే లక్షధికారి అయిపోవచ్చు.. ఎలా అంటే..

|

Feb 08, 2023 | 12:11 PM

మన దేశంలో కొన్ని రకాల పాత నోట్లు, నాణేలు ఉన్నాయి. వాటి విలువ..  వాటి అసలు కంటే చాలా ఎక్కువ రేట్లు ఉంటుంది. ఆ క్రమంలోనే 10..

Ten Rupee Note: మీ దగ్గర రూ.10 పాత నోటు ఉందా..? అయితే మీరు ఇట్టే లక్షధికారి అయిపోవచ్చు.. ఎలా అంటే..
10 Rupees Old Note
Follow us on

Ten Rupee Note: పాత నోట్లు, నాణేల బదులు లక్షల రూపాయలు పొందవచ్చనే వార్తలను మీరు ఇప్పటికే చాలా సార్లు చూసి ఉంటారు. అయితే పాత నాణేలు, నోట్లను నిజంగా కొంటారా..? అని కూడా అనుమానాలను వ్యక్తం చేసే ఉంటారు. అలాంటి సదేహం ఏ మాత్రం అవసరం లేదు. మీ దగ్గర పాత నోట్లు ఉంటే ఎంచక్క ఆన్‌లైన్‌ ద్వారా అమ్మేసుకోవచ్చు. చాలా దేశాలు తమ కరెన్సీలో ఎప్పటికప్పుడు కొన్ని అప్‌డేట్‌లను కూడా చేస్తాయి. భారతీయ కరెన్సీలో కూడా ఎప్పటికప్పుడు తీసుకువచ్చిన అప్‌డేట్‌లు చాలా సార్లు కనిపిస్తాయి. మన దేశంలో కొన్ని రకాల పాత నోట్లు, నాణేలు ఉన్నాయి. వాటి విలువ..  వాటి అసలు కంటే చాలా ఎక్కువ రేట్లు ఉంటుంది. ఆ క్రమంలోనే 10 రూపాయల నోటు విలువ కూడా పెరిగింది. మరి దానిని ఎలా అమ్మేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

ప్రస్తుతం 10 రూపాయల నోటుపై చర్చ జరుగుతోంది. ఈ 10 రూపాయల నోటు ప్రత్యేకత ఏంటంటే.. ఈ నోటు చాలా పాతది. దాని వెనుక నెమలి బొమ్మ కూడా ఉంది. ఈ నెమలితో ఉన్న 10 రూపాయల నోటు ధర నేడు వేల రూపాయల్లో ఉంది. అయితే రూ.10 నెమలి నోటు లభించడం అంత ఈజీ కాదు. ఈ నోట్లు మార్కెట్లో చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇలాంటి నోట్లు మీ దగ్గర ఉంటే మిమ్మల్ని అవి ధనవంతులను చేస్తాయి. మీ వద్ద 10 రూపాయల నెమలి నోటు ఉంటే అది మీకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది.

మీ వద్ద 10 రూపాయల నెమలి నోటు ఉండి.. దాని క్రమ సంఖ్య కూడా మెరుగ్గా ఉంటే.. ఆ నోట్ల ధర మరింత పెరుగుతుంది. ఉదాహరణకు ఈ నోటు సీరియల్ నంబర్‌లో 786 సంఖ్య ఉంటే దాని విలువ భారీగా పెరుగుతుంది. సీరియల్ నంబర్ సాధారణం కానిది అయినా దాని విలువ ఎక్కువగా ఉంటుంది. అలాంటి నోట్ల ధర రూ.30 వేల నుంచి లక్షల వరకు ఉంటుంది. ఈ నోట్ మీ వద్ద ఉంటే.. ఈ నోట్లను ఆన్‌లైన్‌లో అమ్మవచ్చు. Ebay, Quikr, Coinbazaar వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఈ నోట్లను అమ్మడం ద్వారా చాలా డబ్బు సంపాదించవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..