Adani Group: అదానీవన్నీ దొంగ లెక్కలే.. అమెరికా రీసెర్చ్‌ సంస్థ సంచలన ఆరోపణ. అదానీ గ్రూప్‌ వెర్షన్‌ ఏంటంటే..

|

Jan 26, 2023 | 6:04 PM

అదానీ గ్రూప్‌ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని అమెరికాకు చెందిన హిండెన్‌ బర్గ్‌ అనే రీసెర్చ్‌ సంస్థ సంచలన ఆరోపణ చేసింది. అదానీ గ్రూప్‌ తమ ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందని హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ సంస్థ సంచలన నివేదికను వెల్లడించింది. రెండేళ్ల పాటు అదానీ సంస్థ లావాదేవీలపై పరిశోధన చేసినట్టు ఆ సంస్థ తెలిపింది. అయితే...

Adani Group: అదానీవన్నీ దొంగ లెక్కలే.. అమెరికా రీసెర్చ్‌ సంస్థ సంచలన ఆరోపణ. అదానీ గ్రూప్‌ వెర్షన్‌ ఏంటంటే..
Adani Group
Follow us on

అదానీ గ్రూప్‌ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని అమెరికాకు చెందిన హిండెన్‌ బర్గ్‌ అనే రీసెర్చ్‌ సంస్థ సంచలన ఆరోపణ చేసింది. అదానీ గ్రూప్‌ తమ ఖాతాల్లోనూ మోసాలు చేస్తోందని హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ సంస్థ సంచలన నివేదికను వెల్లడించింది. రెండేళ్ల పాటు అదానీ సంస్థ లావాదేవీలపై పరిశోధన చేసినట్టు ఆ సంస్థ తెలిపింది. అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.20,000 కోట్ల మలి విడత పబ్లిక్‌ ఆఫర్‌ ఈనెల 27 నుంచి 31న జరగనున్న సమయంలో వచ్చిన ఆరోపణలతో , బుధవారం అదానీ గ్రూప్‌ షేర్లు భారీగా నష్టపోయాయి.

పన్నులు ఎగ్గొట్టేందుకు అదానీ గ్రూప్‌ కరేబియన్‌, మారిషస్‌ల నుంచి యూఏఈ దేశాల్లో అదానీ కుటుంబం షెల్‌ కంపెనీలను ఏర్పాటు చేసినట్టు హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఆరోపించింది. అదానీ గ్రూప్‌లోని మాజీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లతో పాటు డజన్ల కొద్దీ వ్యక్తులతో మాట్లాడి, వేలకొద్దీ పత్రాలను, దాదాపు 6 దేశాల్లో కంపెనీ కార్యాలయాలను పరిశీలించాకే ఈ పరిశోధనా నివేదికను వెల్లడిస్తున్నామని సంస్థ తెలిపింది. అదానీ గ్రూప్‌ ఆర్థిక ఫలితాలను పరిశీలిస్తే వాస్తవాలు బయటపడుతాయని హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ స్పష్టం చేసింది. షేర్ల ధరలును చూపించి అదానీ సంస్థ భారీగా అప్పులు చేస్తోందని , ఇది చట్టవిరుద్దమని ఆరోపించింది.

కావాలనే టార్గెట్‌ చేస్తున్నారు..

అయితే అదానీ గ్రూప్‌పై అమెరికా బిజినెస్‌ రీసెర్చ్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని అదానీ గ్రూప్‌ ప్రకటన విడుదల చేసింది. తమపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు హిండెన్‌బర్గ్‌ సంస్థపై అమెరికాతో పాటు భారత్‌లో కూడా కేసులు వేస్తునట్టు అదానీ గ్రూప్‌ ప్రకటన చేసిది. షేర్లలో తాము ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని , కావాలనే అదానీ గ్రూప్‌ను టార్గెట్‌ చేసేందుకు ఈ నివేదికను తయారు చేశారని తెలిపింది. ఈ ఆరోపణలు అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్ల విక్రయాన్ని నాశనం చేయాలన్న దురుద్దేశంతో చేసినవని పేర్కొంది. హిండెన్‌బర్గ్‌ సంస్థ తమను సంప్రదించకుండా, నిజనిజాలు తెలుసుకోకుండా నివేదికను వెల్లడించడం షాక్‌కు గురిచేసినట్టు ప్రకటన విడుదల చేసింది. గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయని , కోర్టుల్లో తమకు క్లీన్‌చిట్‌ లభించినట్టు అదానీ గ్రూప్‌ స్పష్టం చేసింది. ఇన్వెస్టర్లు ఇలాంటి నివేదికలపై భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..