Isha ambani: ఇషా అంబానీ- ఆనంద్‌ దంపతుల పిల్లలకు పెట్టిన పేర్లు ఇవే .. వాటి అర్థాలేంటో తెలుసా?

ఇషా, ఆనంద్‌ కవలలకు జన్మనిచ్చాన్న విషయాన్ని తెలియజేయడం తమకెంతో సంతోషంగా ఉందన్న కుటుంబ సభ్యులు.. ప్రస్తుతం ఇషాతో పాటు ఇద్దరు చిన్నారులు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. అదేవిధంగా పిల్లలకు అదియా, కృష్ణలుగా నామకరణం చేసినట్లు ప్రకటనలో చెప్పుకొచ్చారు.

Isha ambani: ఇషా అంబానీ- ఆనంద్‌ దంపతుల పిల్లలకు పెట్టిన పేర్లు ఇవే .. వాటి అర్థాలేంటో తెలుసా?
Anand Piramal, Isha

Updated on: Nov 21, 2022 | 7:03 AM

దేశంలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ మరోసారి తాతయ్యగా ప్రమోషన్‌ పొందారు. ఆయన కుమార్తె ఇషా అంబానీ ఆదివారం కవలలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆదివారం కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఇషా అంబానీ, ఆనంద్‌ పిరమల్‌ దంపతులకు అమ్మాయి, అబ్బాయి పుట్టినట్లు అంబానీ, పిరమల్‌ కుటంబసభ్యులు మీడియాకు తెలియజేశారు. ఇషా, ఆనంద్‌ కవలలకు జన్మనిచ్చాన్న విషయాన్ని తెలియజేయడం తమకెంతో సంతోషంగా ఉందన్న కుటుంబ సభ్యులు.. ప్రస్తుతం ఇషాతో పాటు ఇద్దరు చిన్నారులు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. అదేవిధంగా పిల్లలకు అదియా, కృష్ణలుగా నామకరణం చేసినట్లు ప్రకటనలో చెప్పుకొచ్చారు ముఖేష్– పిరమిల్ కుటుంబ సభ్యులు . మరి ఈ పేర్లకు అర్థమేంటో ఓసారి తెలుసుకుందాం రండి. ఇషా అంబానీ తన కుమారుడికి కృష్ణ అని పేరు పెట్టారు. హిందూ మతంలో శ్రీకృష్ణుడికి ఎంతో ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక కృష్ణుడు అనే పేరు ప్రేమను గుర్తు చేస్తుంది. ఇది నిజం కోసం పోరాటాన్ని గుర్తు చేస్తుంది. దక్షిణ భారతదేశంలో కృష్ణా అనే నది కూడా ప్రవహిస్తుంది. మన దేశంలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు కృష్ణ అని పేరు పెట్టారు. నమ్మకాల ప్రకారం, ఈ పేరుతో ఉన్న పిల్లలు ఇతరుల జీవితాలను తీర్చిదిద్దడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. వారు సమాజంలో కలిసిపోవడానికి ఇష్టపడతారు.

ఆదియా అనే పేరు గురించి మాట్లాడుతూ, భారతీయ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఆదియ అంటే దేవుడు ఇచ్చిన వరం. ఆదియా అనే వ్యక్తులు చాలా సృజనాత్మకంగా ఉంటారని కూడా నమ్ముతారు. ఈ వ్యక్తులు పని పట్ల మక్కువ కలిగి ఉంటారు. మానసిక బలం కూడా ఈ వ్యక్తుల లక్షణాలలో ఒకటి. అంతే కాకుండా చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తి చేయడానికి ప్రతీకగా ఈ పేరును పేర్కొంటారు. ఇషా అంబానీ, ఆనంద్‌ పిరమల్‌ 2018 డిసెంబర్‌ 12న వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. చిన్ననాటి స్నేహితులైన వీరిద్దరూ పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలెక్కారు. ఇషా ప్రస్తుతం రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక ఆనంద్‌ పిరమల్‌ విషయానికొస్తే.. ఈయన పిరమల్ గ్రూప్స్ అజయ్- స్వాతి పిరమల్‌ల కుమారుడు. ప్రస్తుతం ఆనంద్ పిరమల్ గ్రూప్ ఆర్థిక సేవల వ్యాపారాలను నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us