పాన్‌కార్డు.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరికి తెలిసిందే. బ్యాంకు ఖాతా నుంచి లావాదేవీలు చేసే వరకు ప్రతి ఒక్కరికి పాన్‌కార్డు ఉండాల్సిందే. పాన్‌కార్డు ద్వారా ఆర్థిక లావాదేవీల చరిత్రను పరిశీలిస్తుంది ఇన్‌కమ్ ట్యాక్స్. ఈ నేపథ్యంలో బ్యాంకు ఖాతా తీయాలంటే పాన్‌కార్డు తప్పనిసరిగ్గా కావాల్సిందే. అలాగే పాన్‌కార్డు ఉన్న వారు ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడం కూడా ముఖ్యమే. మారుతున్న కాలంతో పాటు పాన్‌కార్డు తప్పనిసరి అయిపోయింది. పాన్ కార్డ్ అనేది ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన చట్టపరమైన పత్రం. ప్రతి ఒక్కరి పన్నులపై ఆదాయపు పన్ను శాఖ ఓఓ కన్నేసి ఉంచుతుంది. అయితే చాలా వాటికి గడువు తేదీ ఉంటుంది. అలాగే పాన్‌కార్డుకు కూడా ఉందా? అనే ప్రశ్న తలెత్తుతుంటుంది. పాన్‌కార్డు చెల్లుబాటు ఎన్ని రోజులు ఉంటుంది? తదితర విషయాల గురించి తెలుసుకుందాం.
పాన్ కార్డు జీవితకాలంగా చెల్లుబాటు కలిగి ఉంటుంది. అంటే ఒకసారి పాన్‌కార్డును తీసుకుంటే వ్యక్తి జీవించి ఉన్నంత కాలం పని చేస్తుంది. పాన్‌కార్డులో ఉండే 10 నంబర్లే ముఖ్యం. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత దానిని సరెండర్ చేసే సదుపాయాన్ని ఇన్‌కమ్ ట్యాక్స్ శాఖ అందిస్తుంది. మరణించిన వ్యక్తి పాన్‌కార్డు యాక్టివ్, డియాక్టివ్ చేసే ప్రక్రియ కూడా ఉంది.
వ్యక్తి మరణించిన తర్వాత కుటుంబ సభ్యులెవరైనా పాన్‌కార్డును ఇన్‌కమ్‌ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు సరెండర్ చేయవచ్చు. కార్డును సరెండర్ చేయాలనుకుంటే ముందుగా మీరు అసెస్‌మెంట్ ఆఫీసర్‌కి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనితో పాటు మీరు దరఖాస్తులో పాన్ కార్డును సరెండర్ చేయడానికి కారణాన్ని కూడా రాయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్‌లో మరణించిన వ్యక్తి పేరు, పుట్టిన తేదీ, మరణ ధృవీకరణ పత్రం, పాన్ నంబర్ వంటి మొత్తం సమాచారాన్ని కూడా నమోదు చేయాలి. ఈ దరఖాస్తుతో పాటు మీరు మరణ ధృవీకరణ పత్రాన్ని కూడా జతచేయాలి. దీనితో పాటు, మీరు దరఖాస్తు కాపీని ఉంచుకోవాలి. దీని తర్వాత మీరు పాన్ కార్డ్ సరెండర్ రుజువు ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి