iPhone: చౌక.. చౌక… భారీగా తగ్గిన ఐఫోన్ రేట్లు.. తాజా ధరలు ఇలా

| Edited By: Ram Naramaneni

Sep 08, 2024 | 11:47 AM

ఆపిల్ ఐ-ఫోన్లపై భారీగా డిస్కౌంట్ లభిస్తోంది. తాజాగా ఈ కామర్స్ సైట్స్ చెక్ చేయగా.. రేట్లు తగ్గినట్లు స్పష్టమవుతుంది. ఏయే సిరీస్‌లపై తగ్గాయ్.. ఎంత తగ్గాయ్ లాంటి వివరాలు తెలుసుకుందాం పదండి....

iPhone: చౌక.. చౌక... భారీగా తగ్గిన ఐఫోన్ రేట్లు.. తాజా ధరలు ఇలా
Iphones
Follow us on

ఐఫోన్ యత్‌కి ఒక క్రేజ్‌గా మారింది. దీన్ని లగ్జరీ సింబల్‌గా భావిస్తారు చాలామంది. ఈ మధ్యన ఒక సినిమా పోస్టర్లో చినిగిన చొక్కా అయినా తొడుక్కో.. కానీ ఐఫోన్ కొనుక్కో అంటూ ఓ క్యాప్షన్ కనిపించిందండోయ్. ఇంతలా ప్రజంట్ ఐఫోన్ మ్యానియా నడుస్తోంది. అయితే ఐఫోన్ రేట్లు.. సాధారణ యాండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తే మూడు రెట్లు దాదాపు ఎక్కువ. అయినా క్వాలిటీ విషయంలో ఆపిల్ ఎలాంటి కాంప్రమైజ్ అవ్వదు అన్న విషయం తెలిసిందే. అందుకే ఆ కంపెనీ ఫోన్లకు అంత క్రేజ్, అంత డిమాండ్. ఐఫోన్ 16 రిలీజ్‌కి సిద్ధమవుతుండడంతో ఐఫోన్ 15 రేట్లు తగ్గుముఖం పడుతున్నాయి.

ఆన్‌లైన్‌లో ఇంతకుముందు ఐఫోన్ 15 ప్రో మాక్స్ 1,59,900 ఉంటే ఇప్పుడు దాని ధర 1,32,990 గా ఉంది. అన్ని ఈ కామర్స్ వెబ్సైట్స్‌లోనూ ఇంచుమించు ధర ఇలానే ఉంది. ఇక 15 ప్రో కూడా 18 నుంచి 25 వేల వరకు డిస్కౌంట్‌లో లభిస్తుంది. అయితే ఐఫోన్ 15, 15 ప్లస్ ధరల్లో పెద్దగా మార్పు లేవు.  కంపెనీ వాటిని విడుదల చేయడం దాదాపు ఆపేయడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు.

గత నాలుగైదు ఏళ్లుగా ఐఫోన్ కొత్త మోడల్స్ రిలీజ్ అయిన తర్వాత పాత మోడల్స్‌గా ఉన్న ప్రో వర్షన్స్ తప్ప మిగతావన్నీ ఆపేస్తుంది ఆపిల్.
ఐఫోన్ 16 ప్రో మాక్స్ ధర 1,60,000 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐఫోన్ 16లో పెద్దగా మార్పులు లేకపోతే తక్కువ ధరకు వచ్చే 15 మోడల్స్‌ని కొనుగోలు చేయడం బెటర్ అని సూచిస్తున్నారు టెక్ ఎక్స్‌పర్ట్స్.  వచ్చేవారం నుంచి ఆపిల్ వాచ్‌ల పైన కూడా భారీగా డిస్కౌంట్ ఉండబోతున్నట్లుగా ఈ కామర్ సైట్లలో కనిపిస్తుంది. ఆపిల్ SE, ఆపిల్ 9 సిరీస్, ఆపిల్ వాచ్ అల్ట్రా 2 లపై డిస్కౌంట్ ఉండబోతున్నట్లుగా సమాచారం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..