Fixed Deposits: ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన ఆ ప్రభుత్వ రంగ బ్యాంకు.. వివరాలు చెక్ చేయండి

IOB Fixed Deposits Interest Rates: తాజాగా ప్రభుత్వ రంగ బ్యాంకైన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచినట్లు బ్యాంక్ వెబ్‌సైట్‌లో తెలిపింది.

Fixed Deposits: ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన ఆ ప్రభుత్వ రంగ బ్యాంకు.. వివరాలు చెక్ చేయండి
Fixed Deposits(File Photo)

Updated on: Jul 09, 2022 | 3:24 PM

IOB Bank FD Interest Rates 2022: ఇటీవల రెపో రేటును ఆర్బీఐ పెంచడంతో వివిధ బ్యాంకులు తమ కస్టమర్లకు ఇస్తున్న రుణాలపై వడ్డీ రేటును పెంచాయి. అదే సమయంలో తమ కస్టమర్లకు మేలు కలిగేలా ఫిక్సిడ్ డిపాజిట్ల (FD)పై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ బ్యాంకైన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచినట్లు బ్యాంక్ వెబ్‌సైట్‌లో తెలిపింది. కొత్త వడ్డీ రేట్లు ఈ నెల 12 నుండి అమలులోకి వస్తాయని తెలిపింది. 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల లోపు మెచ్యూరిటీతో కూడిన ఫిక్సిడ్ డిపాజిట్లు, 444 రోజుల మెచ్యూరిటీలతో కూడిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది.

IOB FD వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి..

7 నుంచి 45 రోజుల్లో మెచ్యూరిటీ అయ్యే డిపాజిట్లపై 3 శాతం వడ్డీ రేటును బ్యాంకు యధాతథంగా కొనసాగించనుంది. అలాగే 46 నుంచి 90 రోజుల్లో మెచ్యూర్ అయ్యే టర్మ్ డిపాజిట్లపై 3.75 శాతం వడ్డీ రేటులో మార్పు ఉండదు. 91 నుంచి 179 రోజుల మధ్య మెచ్యూరిటీ అయ్యే ఫిక్సిడ్ డిపాజిట్‌లకు 4% వడ్డీ రేటు కొనసాగుతుంది. అలాగే 180 రోజుల నుంచి ఒక సంవత్సరం లోపు మెచ్యూరిటీ ఉన్న టర్మ్ డిపాజిట్లపై 4.50 శాతం వడ్డీ రేటు కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి

444 రోజులు మినహా 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల లోపు డిపాజిట్లపై బ్యాంక్ వడ్డీ రేటును 5.40% నుండి 5.45%కి పెంచారు. 444 రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై IOB వడ్డీ రేటును 5.45% నుండి 5.50%కి పెంచింది. IOBలోని ట్యాక్స్ సేవర్ డిపాజిట్‌పై వడ్డీ రేటు 5.60 శాతంగా కొనసాగుతుంది. 2 నుండి 3 సంవత్సరాల డిపాజిట్లపై 5.45 శాతం వడ్డీ రేటు, 3 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ మెచ్యురిటీ పీరియడ్‌తో డిపాజిట్లపై 5.60 శాతం వడ్డీ రేటును కొనసాగిస్తుంది.

IOB FD Interest Rates

Iob Fd Rates

అలాగే సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ రేటు 0.50%, సూపర్ సీనియర్ సిటిజన్లకు (80 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు) 0.75% అదనపు రేటు కొనసాగుతుందని ఐఓబీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

మరిన్ని బిజినెస్ వార్తలు చదవండి