Investments: మార్కెట్లు అస్థరంగా ఉన్నప్పుడు సిప్‌ ఉత్తమమైన ఎంపిక.. ఎందుకంటే..

|

May 29, 2022 | 12:58 PM

2022 సంవత్సరంలో ఇప్పటివరకు స్టాక్ మార్కెట్(Stock Market) పెట్టుబడిదారులకు గందరగోళంగా ఉంది. ముఖ్యంగా గత రెండు నెలల్లో మార్కెట్‌లో భారీ కరెక్షన్‌ చోటుచేసుకుంది.

Investments: మార్కెట్లు అస్థరంగా ఉన్నప్పుడు సిప్‌ ఉత్తమమైన ఎంపిక.. ఎందుకంటే..
Mf Investment
Follow us on

2022 సంవత్సరంలో ఇప్పటివరకు స్టాక్ మార్కెట్(Stock Market) పెట్టుబడిదారులకు గందరగోళంగా ఉంది. ముఖ్యంగా గత రెండు నెలల్లో మార్కెట్‌లో భారీ కరెక్షన్‌ చోటుచేసుకుంది. గత రెండు నెలల్లో సెన్సెక్స్sensx, నిఫ్టీNifty దాదాపు 9 శాతం నష్టపోయాయి. ఈ సమయంలో అనేక అంశాలు మార్కెట్‌ను శాసిస్తున్నాయి. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు, ఇంధన ధరలు పెరుదల, ఉక్రెయిన్ సంక్షోభం, కరోనా కారణంగా చైనా లాక్‌డౌన్‌ మార్కెట్‌పై ప్రభావం చూపుతోన్నాయి. మార్కెట్‌లో కరెక్షన్ కారణంగా పోర్ట్‌ఫోలియో డైవర్సిఫై అయిన వారు కూడా నష్టపోతున్నారు. 2022 సంవత్సరంలో ఇప్పటివరకు స్మాల్‌క్యాప్‌లలో 13 శాతం, మిడ్‌క్యాప్‌లలో 11 శాతం, లార్జ్‌క్యాప్‌లలో 8 శాతం క్షీణత నమోదైంది.

మార్కెట్ అస్థిరంగా ఉన్నప్పుడు పెట్టుబడిదారులు SIP సహాయంతో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలని ఆర్థిక నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఇది మీ నష్టాలను తగ్గించి.. దీర్ఘకాలంలో అధిక రాబడిని ఇస్తుందన్నారు. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, మార్కెట్ పడిపోయినప్పుడు, పెట్టుబడిదారులు SIPలో టాప్-అప్ సహాయంతో పోర్ట్‌ఫోలియోను మల్టీబ్యాగర్‌గా మార్చుకునే అవకాశం ఉంటుంది.
ఇన్వెస్టర్లు ఎప్పటికప్పుడు తమ పోర్ట్‌ఫోలియోను తిరిగి బ్యాలెన్స్ చేసుకోవాలి. అటువంటి పరిస్థితిలో మీ పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ వెయిటేజీ 60 శాతానికి మించి ఉంటే, దానిని తగ్గించడం ద్వారా రుణ వాటాను పెంచవచ్చు. మీరు ఈక్విటీ ఫండ్స్‌లో గోల్ ఆధారిత పెట్టుబడులు పెట్టినట్లయితే, భయపడాల్సిన అవసరం లేదు.

ఇవి కూడా చదవండి