PPF: మీరు పీపీఎఫ్‌లో డబ్బులు పెడుతున్నారా..? ప్రతినెల 5లోపు జమ చేయండి.. ఆ తేదీనే ఎందుకు..?

|

May 30, 2022 | 7:12 PM

PPF: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌)లో నగదు పొదుపు చేయాలని అనుకున వారికి ప్రతి నెల 5వ తేదీ ఎంతో ముఖ్యమనే చెప్పాలి. ఎందుకంటే మీరు 5వ తేదీ కంటే ముందు జమ చేసిన నగదుకు మాత్రమే..

PPF: మీరు పీపీఎఫ్‌లో డబ్బులు పెడుతున్నారా..? ప్రతినెల 5లోపు జమ చేయండి.. ఆ తేదీనే ఎందుకు..?
PPF Vs NPs
Follow us on

PPF: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌)లో నగదు పొదుపు చేయాలని అనుకున వారికి ప్రతి నెల 5వ తేదీ ఎంతో ముఖ్యమనే చెప్పాలి. ఎందుకంటే మీరు 5వ తేదీ కంటే ముందు జమ చేసిన నగదుకు మాత్రమే వడ్డీ లభిస్తుంది. ఆ తర్వాత జమ చేసిన మొత్తానికి..ఆ నెల‌ వడ్డీ వర్తించదని గమనించాలి. పీపీఎఫ్‌లో వడ్డీ ప్రతి సంవత్సరం మార్చి 31న అకౌంట్లో జమ చేసినప్పటికీ ప్రతినెల వడ్డీని లెక్కిస్తారు. ప్రతినెల చివరి రోజు నుంచి ఆ తర్వాత నెల 5వ తేఈ వరకు అకౌంట్లో ఉన్న నగును పరిగణలోకి తీసుకుని వడ్డీని లెక్కిస్తారు.

ప్రస్తుతం పీపీఎఫ్‌ వడ్డీ రేటు 7.10 శాతంగా ఉంది. ఉదాహరణకు.. మీరు నెల ప్రారంభంలో రూ.10వేలు పీపీఎఫ్‌ అకౌంట్లో జమ చేస్తే తర్వాత 7వ తేఈన మరో రూ.5వేలు జమ చేసినా మీకు రూ.10వేలకు మాత్రమే వడ్డీ వర్తిస్తుంది. అందుకే పీపీఎఫ్‌లో డిపాజిట్‌ చేసే వారు ప్రతి నెల 5వ తేదీ లోపు మాత్రమే జమ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో చిన్న మొత్తాలే దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో జమ అవుతాయని తెలుసుకోవాలి. అయితే ప్రతి నెల 5వ తేదీకి ముందు పీపీఎఫ్‌ ఖాతాలో పెట్టుబ‌డిని జమ చేస్తే వడ్డీ రేట్ల ప్రయోజనంతో పాటు, పన్నులను కూడా మినహాయించే అవకాశం కూడా ఉంటుంది.

5వ తేదీనే ఎందుకు..?

ఇవి కూడా చదవండి

ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రతినెల 5వ తేదీనే నిర్ణయించింది. ఎందుకంటే ఉద్యోగులకు ప్రతినెల 5వ తేదీలోపే జీతాలు అందుతాయి. దీంతో సులభంగా పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఈ తేదీ లోపే పీపీఎఫ్‌లో డబ్బులు జమ చేస్తే మిగతా 25 రోజులకు వడ్డీ వర్తిస్తుందనే ఉద్దేశంతో ఈ తేదీని నిర్ణయించింది. దీంతో పాటు సెక్షన్‌ 80C కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. సంవత్సరానికి పీపీఎఫ్‌ ఖాతాలో రూ.1,50,000 జమ చేస్తే సెక్షన్‌ 80C ప్రకారం పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇందు కోసం ప్రతినెల నెతి నెల రూ.12,500 జమ చేస్తే మంచిది. ఇలా జమ చేసిన తర్వాత 15 ఏళ్లకు మెచ్యూరిటీ కాలానికి దాదాపు రూ.40 లక్షల వరకు సమకూర్చుకోవచ్చు. పీపీఎఫ్‌లో వార్షికంగా కనీసం రూ.500 నుంచి రూ.1.50 లక్ష వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి