సాధారణంగా జీవిత బీమా అంటే వయసు పైబడిన వారికి ఉపయోగపడేది అనే భావనలో ఉంటాము. అయితే ఇండియన్ పోస్టాఫీస్ చిన్నారుల కోసం కూడా ఒక జీవిత బీమా పథకాన్ని తీసుకొచ్చింది. బాల్ జీవన్ బీమా పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా చిన్నారులు జీవిత బీమాను పొందొచ్చు. రోజుకు కేవలం రూ. 6 పెట్టుబడిగా పెడితే రూ. లక్ష ఇన్సూరెన్స్‌ను పొందొచ్చు. ఇంతకీ ఈ పథకానికి ఎవరు అర్హులు.? పాలసీని ఎలా పొందాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
చిన్నారులు అకాలంలో మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఈ జీవిత బీమా పాలసీ ఉపయోగపడుతుంది. 8 నుంచి 12 ఏళ్ల వయసున్న చిన్నారులు బాల్ జీవన్ బీమా యోజన పాలసీని తీసుకోవడానికి అర్హులు. ఈ పాలసీ చిన్నారి 18 ఏళ్ల వయసు వచ్చే వరకు కవర్ అవుతుంది. పాలసీ తీసుకున్న వారు రోజుకు రూ. 6 చొప్పున నెలకు రూ. 180 డిపాజిట్ చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ పాలసీ తీసుకున్న సదరు చిన్నారి 18 ఏళ్ల లోపు మరణిస్తే వారి కుటుంబానికి రూ. లక్ష ఇన్సూరెన్స్ లభిస్తుంది.
బాల్ జీవన్ బీమా పాలసీని తీసుకోవాలనుకునే వారు నేరుగా దగ్గర్లోని పోస్టాఫీస్‌ను సందర్శించాల్సి ఉంటుంది. అనంతరం సంబంధిత ఫామ్‌ను తీసుకొని చిన్నారి పేరు, వయసు, చిరునామాతో పాటు నామినికి సంబంధించిన వివరాలను అందించాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..