సీనియర్ సిటిజన్లు కచ్చితంగా తమ రిటైర్‌మెంట్ సొమ్మును నమ్మకమైన రాబడి కోసం వివిధ పథకాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. అయితే గతేడాది నుంచి ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యలతో ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను అన్ని బ్యాంకులు గణనీయంగా పెంచాయి. అయితే సీనియర్ సిటిజన్లకు అయితే సాధారణ ఖాతాదారులకంటే అధికంగా వడ్డీ రేటును అందిస్తున్నాయి. సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటు రెండు చిన్న ఫైనాన్స్ బ్యాంకులు అయితే ఏకంగా 9.5 శాతం పెరిగింది. ఈ బ్యాంకులు సాధారణ ఖాతాదారులకు 9 శాతం కంటే ఎక్కువ వడ్డీని అందిస్తున్నాయి. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తమ ఖాతాదారులకు ఎఫ్‌డీలపై వడ్డీని గణనీయంగా పెంచుతున్నట్లు ఇటీవల ప్రకటించింది. రూ.2 కోట్ల కంటే తక్కువ ఉన్న ఎఫ్‌డీలకు సీనియర్ సిటిజన్లకు9.6 శాతం వడ్డీని అందిస్తున్నట్లు వెబ్‌సైట్‌లో పేర్కొంది. అలాగే సాధారణ ఖాతాదారులకు 9.1 శాతం వడ్డీని అందిస్తుంది. అలాగే యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా సీనియర్ సిటిజన్లకు 9.5 శాతం వడ్డీని ఆఫర్ చేస్తుంది. అలాగే సాధారణ ఖాతాదారులకు 9 శాతం వడ్డీని అందిస్తున్నట్లు పేర్కొంది. ప్రధాన బ్యాంకులైన ఎస్‌బీఐ 7.6 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 7.75 శాతం, యాక్సిస్ బ్యాంక్ 7.95 శాతం, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ 8.25 శాతం వడ్డీని అందిస్తుంది.
ప్రస్తుతం బ్యాంకులు ఎఫ్‌డీలపై అందించే వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. భవిష్యత్తులో ఆర్‌బీఐ రెపో రేటును మళ్లీ పెంచితే మరింత పెరగవచ్చు. సీనియర్ సిటిజన్‌లు, ఇతరులకు అధిక రేట్ల వద్ద ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి అవకాశం. ముఖ్యంగా ఎఫ్‌డీలు హామీ ఇచ్చినరాబడిని అందించడమే కాకుండా వివిధ మార్కెట్-లింక్డ్ ఉత్పత్తుల కంటే సురక్షితమైనవిగా పరిగణిస్తారు. అయితే, పెట్టుబడి పెట్టడానికి ముందు ఆర్‌బీఐ డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐజీసీసీ) నిబంధనల ప్రకారం కేవలం రూ. 5 లక్షల వరకు మాత్రమే హామీ ఇస్తారని అంటే, బ్యాంక్ ఫెయిల్యూర్ అయినప్పుడు బ్యాంకులో మీ రూ. 5 లక్షల వరకు డిపాజిట్లు సురక్షితంగా ఉంటాయి. రూ. 5 లక్షల పరిమితి వడ్డీతో పాటు అసలు మొత్తం కలిపి ఉంటుంది. బ్యాంకు వైఫల్యం చెందితే బ్యాంకులు 90 రోజుల్లోగా డిపాజిటర్లకు డబ్బును తిరిగి ఇవ్వాలి. ప్రస్తుతం ఉన్న అధిక ఎఫ్‌డీ రేట్లను సద్వినియోగం చేసుకోవడానికి, హామీతో కూడిన రాబడిని పొందడానికి సీనియర్ సిటిజన్లు, ఇతరులు ఆ మొత్తాన్ని మాత్రమే అసలు, వడ్డీ మొత్తం రూ. 5 లక్షలకు మించని బ్యాంకులో పెట్టుబడి పెట్టాలి. ఎక్కువ డిపాజిట్లు చేయడానికి కస్టమర్‌లు సురక్షితంగా ఉండటానికి వివిధ బ్యాంకుల్లో బహుళ ఎఫ్‌డీల్లో ఖాతాలను తెరవవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..