Nandan Nilekani : ఏఐ వల్ల ఎక్కవగా పోయేది వారి జాబులే.. ఇన్ఫోసిస్ కో ఫౌండర్ కీలక వ్యాఖ్యలు!

AI impact on Jobs: ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ)ను ఒక బిగ్‌ రెవెల్యూషన్‌గా చూస్తోంది. ఇది వచ్చాక చాలా పనులన్నీ చాలా సులభమైపోయానని ఓ వర్గం ఆలోచిస్తుంటే.. మరో వర్గం మాత్రం.. ఈ ఏఐ రాక తమ ఉద్యోగాలకు ఎసరు పెడుతోందని అంటోంది. అయితే ఫ్యూచర్‌లో ఈ ఏఐ ప్రభావం ఎక్కువగా ఏ రంగంపై ఉంటుందనే దానిపై ప్రముఖ వ్యాపారవేత్త న్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకణి షాకింగ్ విషయాలు చెప్పారు అవేంటో తెలుసుకుందాం పదండి.

Nandan Nilekani : ఏఐ వల్ల ఎక్కవగా పోయేది వారి జాబులే.. ఇన్ఫోసిస్ కో ఫౌండర్ కీలక వ్యాఖ్యలు!
Nandan Nilekani On Ai Disruption

Updated on: Aug 08, 2026 | 4:41 PM

ఏఐ ప్రస్తుతం.. ఈ సరికొత్త టెక్నాలజీ యావత్ ప్రపంచాన్ని ఏలుతోంది. ఇలా కొత్తగా పుట్టుకొచ్చే టెక్నాలజీల వల్ల ప్రయోజనం ఎంత ఉంటుందో.. ప్రతికూల ప్రభావం కూడా అలానే ఉంటుంది. ముఖ్యంగా ఈ ఏఐ రాకతో ఉద్యోగాలు పోతాయని గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. తాజాగా ఇదే అంశంపై ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకణి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏఐ ప్రభావంతో ఉద్యోగాల కోత అనేది వాస్తవమేనని తెలిపాడు. రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద కార్పోరేట్ సంస్థల్లో ఉద్యోగాల కోత లేకపోలేదని తెలిపారు. పెద్ద కంపెనీలతో పోల్చుకుంటే.. చాలా మంది ఉద్యోగులు చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌లలోనే ఉంటారని అన్నారు.

రాబోయే రోజుల్లో ఏఐ ప్రభావం ఎలా ఉండబోతుంది?

పెద్ద సంస్థలపై ప్రభావం: నందన్ ప్రకారం.. పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో ఒకే రకమైన పనునలు క్రమం తప్పకుండా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఉత్పత్తిని పెంచి, ఖర్చులను తగ్గించుకోవడానికి పెద్ద కంపెనీలు AIని వాడే అవకాశం ఉందని ఆయన అన్నారు. దీనివల్ల ఆ సంస్థల్లో కొత్త ఉద్యోగాల సృష్టి ఆగిపోయి, ఉద్యోగాలు పోయే ప్రమాదం పెరగవచ్చని తెలిపారు.

చిన్న వ్యాపారాలే ఉద్యోగ ఇంజన్లు: భవిష్యత్తులో ఉద్యోగాల కల్పన అనేది కోట్లాది చిన్న వ్యాపారాలు, పారిశ్రామికవేత్తల ద్వారానే జరుగుతుందని ఆయన అన్నారు. చిన్న సంస్థలలో పనులు వైవిధ్యంగా ఉండటం వల్ల AI ప్రభావం వాటిపై తక్కువగా ఉంటుందని తెలిపారు. దేశంలో ప్రస్తుతం సుమారు 1.5 లక్షలుగా ఉన్న స్టార్టప్‌ల సంఖ్య 2035 నాటికి 10 లక్షలకు వరకు చేరే అవకాశం ఉందని అన్నారు. ఈ స్టార్టప్‌లో ఫ్యూచర్‌లో ఉద్యోగాల సృష్టికర్తలు అవుతాయన్నారు.

డిజిటల్ మౌలిక సదుపాయాలు: అకౌంట్ అగ్రిగేటర్, ONDC వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (DPI) చిన్న వ్యాపారాలకు ఆర్థిక సాయం, మార్కెట్ ప్రాప్యతను సులభతరం చేయడంతో కీలక పాత్ర పోషిస్తాయని.. వ్యాపారాన్ని ఈజీగా చేయడానికి రూల్స్‌లో మార్పులు చేయడం అవసరమని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us