Industry Budget 2022: కోవిడ్ మహమ్మారి మూడో వేవ్ మధ్య, భారత ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్లే మార్గాన్ని సూచించడంలో యూనియన్ బడ్జెట్ 2022 ఎంతో కీలకం కానుంది. మూడో వేవ్ నుంచి పెరుగుతున్న అనిశ్చితిలో రికవరీకి మద్దతు ఇవ్వడానికి ఆర్థికంగా మరింతగా చేయూతనిచ్చేందుకు ప్రభుత్వాన్ని బలవంతం చేస్తుందని మార్కెట్ పరిశీలకులు భావిస్తున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Niramala Sitaraman) ఫిబ్రవరి 1న 2022 బడ్జెట్(Budget 2022)ను సమర్పించనున్నారు. ఈ మేరకు ఆటోమొబైల్ రంగం(Automobile Industry) రాబోయే బడ్జెట్ నుంచి ఏం ఆశిస్తుందో ఇప్పుడు చూద్దాం.
“చాలా ప్రభుత్వాలు ఉత్పాదక వ్యయం, సబ్సిడీలను అందించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే అంశాలను పరిశీలిస్తున్నాయి. అందువల్ల బ్యాంకింగ్, ఆటో, ఇన్‌ఫ్రా, ఎరువులు, చక్కెర రంగాలపై యూనియన్ బడ్జెట్‌లో ఎక్కువ దృష్టి పెట్టాలని మేం భావిస్తున్నాం” అని షేర్ ఇండియా సెక్యూరిటీస్ రవి సింగ్ వైస్ ప్రెసిడెంట్, రీసెర్చ్ హెడ్ తెలిపారు.
ప్రొఫిషియెంట్ ఈక్విటీస్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ మనోజ్ దాల్మియా బడ్జెట్ 2022కి ముందు మూడు రంగాలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు.
● రియల్ ఎస్టేట్, లెండింగ్-ప్రస్తుతం ఈరంగంలో తక్కువ వడ్డీ విధానంతో పాటు కొన్ని పన్ను ప్రయోజనాలను ఆశించవచ్చు. ఈ రంగంపై దృష్టి పెట్టడానికి ఇది ఉత్తమ సమయం.
● పబ్లిక్ సెక్టార్‌లు – నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (NMP) కింద ప్రభుత్వ రంగ సంస్థల అసెట్ మానిటైజేషన్.
● మౌలిక సదుపాయాలు, రైల్వేలు, వ్యవసాయం కూడా దృష్టి సారించాల్సిన కొన్ని కీలక రంగాలుగా ఉన్నాయి.
GCL సెక్యూరిటీస్ వైస్ ఛైర్మన్ రవి సింఘాల్ మాట్లాడుతూ, ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌కు ముందు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, PSUపై దృష్టి సారిస్తామన్నారు.
కాగా, పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31న రాష్ట్రపతి ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించడంతో ప్రారంభమై ఏప్రిల్ 8న ముగుస్తాయని లోక్‌సభ సెక్రటేరియట్ శుక్రవారం ప్రకటించారు.
2022-23కి సంబంధించి కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న సమర్పించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం జనవరి 31న ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నట్లు లోక్‌సభ సెక్రటేరియట్ బులెటిన్‌లో పేర్కొన్నారు.