Digital App: ఈ బ్యాంక్ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక అన్ని సేవలు ఒకే యాప్‌లో..

Digital App: ఈ యాప్‌ ద్వారా ఎంపిక చేసిన బ్రాండ్స్, అలాగే ఎంపిక చేసిన బ్రాండ్, ఇంధన ఖర్చులపై 3% వరకు రివార్డులు, డెబిట్ కార్డ్ లావాదేవీలపై జీరో ఫారెక్స్ మార్కప్, ఉచిత లాంజ్ యాక్సెస్ వంటి ప్రయోజనాలను అందిస్తుంది. వడ్డీ..

Digital App: ఈ బ్యాంక్ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక అన్ని సేవలు ఒకే యాప్‌లో..

Updated on: Jun 06, 2025 | 10:45 AM

ఇండస్‌ఇండ్ బ్యాంక్ తన అధునాతన ఆర్థిక యాప్ ‘ఇండీ'(INDIE)ని మరింతగా విస్తరించుకుంటోంది. 1.5 కోట్ల మందికి పైగా ఉన్న రిటైల్ బ్యాంకింగ్ కస్టమర్లందరికీ ఈ యాప్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సేవింగ్స్‌ అకౌంట్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, రుణాలు, క్రెడిట్‌ కార్డులు, మ్యూచువల్‌ ఫండ్స్‌ సహా అనేక సేవలను ఒకే డిజిట్‌ వేదికగా అందిస్తోంది.

ఈ యాప్ ఇప్పటికే గణనీయమైన పురోగతిని సాధించింది. 1.4 మిలియన్లకు పైగా కొత్త ఖాతాలు తెరవబడ్డాయి. 50% నెలవారీ యాక్టివ్ యూజర్ రేటు (MAU) – పరిశ్రమ బెంచ్‌మార్క్ 40% కంటే చాలా ఎక్కువగా ఉంది. ఈ యాప్ నంబర్‌లెస్ డెబిట్ కార్డ్, వర్చువల్ సింగిల్-యూజ్ కార్డ్, డైనమిక్ ఏటీఎం పిన్‌లు వంటి వినూత్న ఫీచర్లను అందిస్తుంది.

ఈ యాప్‌ ద్వారా డిజిటల్, బ్రాంచ్‌రహిత ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ ద్వారా రోజువారీ బ్యాంకింగ్ లావాదేవీలు సులభతరం చేసేలా ఉంది. ఈ సందర్భంగా ఇండస్‌ఇండ్ బ్యాంక్ డిజిటల్ బ్యాంకింగ్, స్ట్రాటజీ హెడ్ చారు సచ్‌దేవా మాథుర్ మాట్లాడుతూ, ప్రస్తుత రిటైల్ వినియోగదారులందరికీ ఈ యాప్‌ సేవలు అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. వినియోగదారులు నేటికాలానుగుణంగా మారుతున్న అవసరాలకు తగినట్లుగా అన్ని రకాల సేవలు పొందేలా డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థను సృష్టించడమే తమ లక్ష్యమని అన్నారు.

ఇది కూడా చదవండి: Indian Railways: మీకు తెలుసా..? రైలు బోగీలపై ఉండే ఈ నంబర్ల అర్థం ఏంటి?

ఈ యాప్‌ ద్వారా ఎంపిక చేసిన బ్రాండ్స్, అలాగే ఎంపిక చేసిన బ్రాండ్, ఇంధన ఖర్చులపై 3% వరకు రివార్డులు, డెబిట్ కార్డ్ లావాదేవీలపై జీరో ఫారెక్స్ మార్కప్, ఉచిత లాంజ్ యాక్సెస్ వంటి ప్రయోజనాలను అందిస్తుంది. వడ్డీ రేటుతో అనుసంధానమై పొదుపు, ఆటో స్వీప్ ఫీచర్లు, రూ.5 లక్షల వరకు ఫ్లెక్సిబుల్ లైన్ ఆఫ్ క్రెడిట్ వంటి స్మార్ట్ డిపాజిట్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Trump-Musk: మాటల యుద్ధం.. ట్రంప్‌పై మస్క్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి