Stock Market: స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు.. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపుతో కొనసాగనున్న అస్థిరత..!

స్టాక్‌ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బుధవారం ఉదయం 9:44 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 93 పాయింట్లు నష్టపోయి 52,570 వద్ద కొనసాగుతోంది...

Stock Market: స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు.. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపుతో కొనసాగనున్న అస్థిరత..!
Stock Market

Updated on: Jun 15, 2022 | 10:06 AM

స్టాక్‌ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బుధవారం ఉదయం 9:44 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 93 పాయింట్లు నష్టపోయి 52,570 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 36 పాయింట్ల తగ్గి 15,695 వద్ద ట్రేడవుతోంది. యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ మీటింగ్‌పై పెట్టుబడిదారులు దృష్టి సారించారు. ఒకవేళ వడ్డీ రేట్లు పెంచితే మార్కెట్‌పై ప్రభావం పడొచ్చు. ఐపీఎల్‌ 2023 నుంచి 2027 వరకు డిజిటల్ ప్రసార హక్కులను నెట్‌వర్క్‌18కు చెందిన వయికాం సొంతం చేసుకుంది. దీంతో నెట్‌వర్క్‌18 షేర్లు 2 శాతం పెరిగాయి. చాలా కాలం తర్వాత వన్‌97 కమ్యూనికేషన్స్‌ సంస్థ పేటీఎం  2 శాతం పెరిగింది. నెలవారీ కస్టమర్ల పెరుగుదలతో పేటీఎం షేరు పెరిగింది.

టాటా మోటర్స్, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండస్‌లాండ్‌ బ్యాంక్, ఏసియన్  పెయింట్స్‌, బజాజ్ ఆటో లాభాల్లో ఉండగా.. హిందూస్థాన్ యూనిలివర్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బ్రిటనియా, టాటా స్టీల్‌ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. హిందుమోటర్, టాటా స్టీల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, అదానీ పవర్, హెచ్‌సీఎల్‌ టెక్‌లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది.