Indians stocking: యుద్ధ వార్తల నేపథ్యంలో దేశంలో చాలా మంది వంట నూనెలు(Cooking Oil), పెట్రోల్, డీజిల్ ను భారీగా కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నారు. రష్యా చర్యలు మరింత తీవ్రతరం కావటం.. ఈ అనిశ్చితి మరింత కాలం పాటు కొనసాగుతుందనే వార్తలతో చాలా మంది ఇప్పటికే వంట నూనెలను భారీగా కొనుగోలు చేశారు. మరో పక్క దీనికి తోడు ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ధరలు(Crude Oil) ఇంతకు ముందు ఎన్నడూ లేని స్థాయిలో పెరిగిపోవటం వల్ల దేశీయంగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు సైతం పూర్తి కావటంతో ఇక కేంద్ర ప్రభుత్వం ఇంధన రేట్లను పెంచుతుందని ఆందోళన చెందుతున్న చాలా మంది సామాన్యులు పెట్రో డీజిల్ లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
వాట్సాప్‌లో చాట్ లోని ఒక మెసేజ్ ప్రకారం.. యుద్ధం కారణంగా వంట నూనెల కొరత ఏర్పడుతుందని.. అందుకే తాను అవసరానికి మించి వంట నూనెను కొనుగోలు చేసినట్లు ముంబయికి చెందిన ఒక గృహిణి తెలిపారు. ఆమె సాధారణ వినియోగానికి రెండింతలు అంటే 10 లీటర్ల వంట నూనెను భయంతో ముందుగానే కొనుగోలు చేసింది. ఒక్కసారిగా వంట నూనె ధరలు 20 శాతం మేర పెరుగుతాయని, నూనెలు కొరత వస్తుందని వస్తున్న వార్తలతో భయాలకు లోనవుతున్న అనేక మంది దేశంలో ఇలా ఎక్కువ కొనుగోళ్లు చేస్తున్నారు.
దేశంలోని రెండితల నూనెలను విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. వీటిలో సన్ ఫ్లవర్ నూనె 90 శాతం రష్యా ఉక్రెయిన్ నుంచే వస్తోంది. వీటికి తోడు పామ్, సోయా, పల్లీ నూనె అందుబాటులో ఉన్నందున వినియోగదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ముంబయికి చెందిన సాల్వెంట్ ఎగుమతులు అసోసియేషన్ కు చెందిన మెహతా వెల్లడించారు.
మరో పక్క ఇంధనాల విషయంలోనూ ఇదే జరుగుతోంది. మహారాష్ట్రకు చెందిన ఒక రైతు మాట్లాడుతూ.. వార్తా ఛానళ్లలో వచ్చిన కథనాలతో తాను వ్యవసాయ అవసరాలకోసం ముందుగా డీజిల్ కొన్నానని తెలిపారు. రూ. 15- రూ20 వరకు ధరలు పెరగనున్నందున వాటిని కొని నిల్వ చేస్తున్నట్లు తెలిపారు. ఇలాగే చాలా మంది రైతులు పంట చేతికొచ్చే సమయం కాబట్టి ఇలానే చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ధరలు 2008 నాటి కంటే గరిష్ఠ స్థాయిలను చేరాయి. రష్యాపై ఆంక్షలు ఉన్నందున అందరి చూపు ఇరాన్ ఆయిల్ పైనే ఉంది ప్రస్తుతం.
ఇవీ చదవండి..