Market Closing Bell: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. రాణించిన ఎఫ్‌ఎంసీజీ, పవర్, ఆటో షేర్లు..
Market Closing Bell: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ప్రధానంగా ఎఫ్‌ఎంసీజీ, పవర్, ఆటో సెక్టార్లకు సంబంధించిన షేర్లలో జోష్ కనిపించింది.

Stock market
Market Closing Bell: గత సెషన్ లో నష్టాలను చవిచూసిన ష్టాక్ మార్కెట్లు.. ఈ రోజు గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సానుకూలతల నడుమ ఉదయం లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు చివరికి లాభాల్లోనే ముగిశాయి. ఉదయం బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్(Sensex) ఒకానొక సమయంలో 900 పాయింట్లకు పైగా లాభపడింది. ఇదే సమయంలో మరో కీలక సూచీ నిఫ్టీ(Nifty) 500 పాయింట్ల వరకు లాభపడింది. కానీ.. మార్కెట్ క్లోజింగ్ సమయంలో సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ సూచీ 701 పాయింట్ల లాభంతో 57,521 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ 206 పాయింట్ల లాభం వద్ద 17,245 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ సూచీ సైతం 390 పాయింటలకు పైగానే లాభంలో ముగిసింది. దీనికి ప్రధానంగా.. ఫార్మా, పవర్, ఆటో, ఆయిల్ & గ్యాస్ షేర్లను కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపగా.. ఐటీ, మెటల్, రియల్ఎస్టేట్ షేర్లను ఎక్కువగా విక్రయించారు.
హిందుస్థాన్ యూనిలివర్ 4.51%, యూపీఎల్ 3.24%, ఏషియన్ పెయింట్స్ 3.16%, పవర్‌గ్రిడ్ 2.75%, ఎన్టీపీసీ 2.60%, ఎల్ అండ్ టీ 2.52%, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.06%, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 2.04%, ఇన్ఫోసిస్ 1.92%, యాక్సిస్ బ్యాంక్ 1.81% మేర లాభపడి క్లోజింగ్ లో టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇదే సమయంలో బజాజ్ ఆటో 1.82%, హిందాల్కో 0.75%, భారతీ ఎయిర్టెల్0.68%, మహీంద్రా అండ్ మహీంద్రా 0.43%, వేదాంతా 0.24%, హెచ్సీఎల్ టెక్నాలజీస్ 0.28%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 0.09%, ఓఎన్జీసీ 0.03%, అదానీ పోర్ట్స్ 0.02% మేర నష్టపోయి క్లోజింగ్ లో టాప్ లూజర్స్ గా నిలిచాయి.
ఇవీ చదవండి..



