Stock Market: భారత స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్(Sensex) ఆరంభంలోనే 240 పాయింట్ల మేర పతనం కాగా.. మరో సూచీ నిఫ్టీ(Nifty) 65 పాయింట్ల వరకు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 510 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ సూటీ మాత్రం 120 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ సూచీ 1% మేర పతనం కావడానకి.. ప్రధానంగా ప్రైవేటు రంగంలోని బ్యాంకింగ్ దిగ్గజాలైన కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి.
జీ ఎంటర్ ప్రైజెస్ 10%, గెయిల్ 2.02%, కోల్ ఇండియా 1.94%, డాక్టర్ రెడ్డీస్ 1.71%, హిందాల్కో 1.65%, ఓఎన్జీసీ 1.40%, ఐటీసీ 1.19%, వేదాంతా 1.15%, లుపిన్ 1.11%, టాటా స్టీల్ 0.79% మేర ఆరంభంలో పెరిగి టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇదే సమయంలో.. కోటక్ మహీంద్రా 3.32%, హెచ్పీసీఎల్ 2.37%, హెచ్డీఎఫ్సీ 1.51%, టైటాన్ 1.50%, ఐసీఐసీఐ 1.46%, యాక్సిస్ బ్యాంక్ 0.78%, స్టేట్ బ్యాంక్ 0.70%, ఇండస్ ఇండ్ బ్యాంక్ 0.68%, టాటా మోటార్స్ 0.63% మేర నష్టపోయి ఆరంభంలో టాప్ లూజర్స్ గా నిలిచాయి.
ఇవీ చదవండి..
Taxation: షేర్ల అమ్మకంపై వచ్చే లాభాల్ని ఎలా లెక్కిస్తారు.. ఇందులో ఉన్న వివాదాలు ఏమిటి..?
Cotton Exports: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో కాటన్ ఎగుమతులకు బ్రేక్..