Indian Railways: భారతదేశంలోని అత్యంత అందమైన రైలు మార్గాలు ఎక్కడో తెలుసా..?

భారతీయ రైల్వేలు దేశంలోని వివిధ ప్రాంతాల గుండా వెళుతున్నాయి. ఇది ప్రపంచంలోని నాల్గవ అతిపెద్ద రైల్వే. అయితే రైలు నెట్‌వర్క్ ఎంతో పొడవైన మార్కాన్ని విస్తరించి ఉంది. ఆకర్షణీయంగా, అందంగా ఉండే కొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. రైలు ప్రయాణం చేయడం ద్వారా జీవితంలో మర్చిపోలేని అందాలను తిలకించవచ్చు. సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా రైలు ప్రయాణం కూడా చాలా చౌకగా ఉంటుంది. మరోవైపు, రైలు మార్గం అందంగా ఉంటే ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది..

Indian Railways: భారతదేశంలోని అత్యంత అందమైన రైలు మార్గాలు ఎక్కడో తెలుసా..?
Train

Updated on: Aug 12, 2023 | 6:51 PM

దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే అది రైల్వే అని చెప్పక తప్పదు. చాలా మంది రైలు ప్రయాణం చేయాలని కోరుకుంటారు. బస్సు రవాణా కంటే రైల్వే ఛార్జీలు తక్కువగా ఉండటం కారణంగా సామాన్యుడు సైతం రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటాడు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మెరుగైన సేవలను అందిస్తుంటుంది ఇండియన్‌ రైల్వే శాఖ. అలాగే రైల్వే వ్యవస్థకు చాలా చరిత్ర ఉంటుంది. రైలు ప్రయాణం చేయడం ఎంతో సరదా. ఎలాంటి గతుకులు లేకుండా ఉండే రైల్వే ట్రాక్‌పై రైలు వెళ్తుండటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంటుంది.

భారతీయ రైల్వేలు దేశంలోని వివిధ ప్రాంతాల గుండా వెళుతున్నాయి. ఇది ప్రపంచంలోని నాల్గవ అతిపెద్ద రైల్వే. అయితే రైలు నెట్‌వర్క్ ఎంతో పొడవైన మార్కాన్ని విస్తరించి ఉంది. ఆకర్షణీయంగా, అందంగా ఉండే కొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. రైలు ప్రయాణం చేయడం ద్వారా జీవితంలో మర్చిపోలేని అందాలను తిలకించవచ్చు. సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా రైలు ప్రయాణం కూడా చాలా చౌకగా ఉంటుంది. మరోవైపు, రైలు మార్గం అందంగా ఉంటే ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. మనం భారతదేశంలోని అలాంటి కొన్ని రైలు మార్గాల గురించి తెలుసుకుందాం.

కొన్ని రైలు మార్గాలు ప్రకృతి అందాలను చుట్టి ప్రకృతి ఒడిలోంచి ఉద్భవించే విధంగా ఉంటాయి. చాలా మంది పర్యాటకులు ఈ రైలు మార్గాల్లో అందాలను తిలకించేందుకు వెళ్తారు. ముంబై నుంచి గోవా ప్రయాణం కోసం ఈ రైలు అరేబియా సముద్రం ఒడ్డు గుండా వెళుతుంది. అలాగే భారతదేశంలోనే అత్యంత అందమైన రైలు ప్రయాణంగా చెప్పుకోవచ్చు. గోవా వెళ్లే చాలామంది కచ్చితంగా ఈ రైలులో ఒక్కసారైనా ప్రయాణించాలని కోరుకుంటారు.

ఇవి కూడా చదవండి

కన్యాకుమారి నుంచి త్రివేండ్రం వరకు రైలులో ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. ఈ ప్రయాణం దాదాపు 20 గంటలు పడుతుంది. కల్కా-సిమ్లా రైలు మార్గంలో నడుస్తున్న రైళ్లు టాయ్ రైళ్లను పోలి ఉంటాయి. అలాగే 96 కిలోమీటర్ల పొడవు ఉంటాయి. ఢిల్లీలోని జోధ్‌పూర్ నుంచి జైసల్మేర్ మార్గంలో జైసల్మేర్ ఎక్స్‌ప్రెస్ రైలు అందరినీ ఆకర్షిస్తుంది. కర్జాత్ నోలావాలా ఎక్స్‌ప్రెస్ రైలు పశ్చిమ కనుమల గుండా వెళుతుంది. అలాగే ఈ రైలు ప్రయాణం కూడా ప్రకృతి ఒడిలో సాగుతుంది. రైలు ప్రయాణం చేస్తుంటే అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. మండపం నుంచి రామేశ్వరం వరకు రైలు ప్రయాణం చాలా అందంగా ఉంటుంది. మీరు కూడా రైల్వేలో ప్రయాణించాలని అనుకుంటే మీరు కనీసం ఒక్కసారి అయినా ఈ రైలు మార్గాలను సందర్శించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి