Indian Railways: కారణం లేకుండా రైల్లో చైన్ లాగితే శిక్ష ఏమిటి? రైల్వే నిబంధనలు ఏంటి?

|

Aug 18, 2024 | 9:30 AM

ఇండియన్‌ రైల్వే.. ఇది దేశంలోని అతిపెద్ద రవాణా వ్యవస్థ. భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉంది. అయితే ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. అలాగే రైల్వే నిబంధనలు కూడా మారుస్తూ ఉంటుంది. అయితే ఎటువంటి కారణం లేకుండా రైళ్లు ఆలస్యంగా రావడంతో చాలా సార్లు ప్రయాణికులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. రైలులో చైన్‌ లాగడం ప్రధానమైనది. చైన్ లాగడం వల్ల రైళ్లు తమ గమ్యస్థానాలకు చేరుకోవడంలో ఆలస్యమవుతుంది. ఈ క్రమంలో..

Indian Railways: కారణం లేకుండా రైల్లో చైన్ లాగితే శిక్ష ఏమిటి? రైల్వే నిబంధనలు ఏంటి?
Indian Railwyas
Follow us on

ఇండియన్‌ రైల్వే.. ఇది దేశంలోని అతిపెద్ద రవాణా వ్యవస్థ. భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉంది. అయితే ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. అలాగే రైల్వే నిబంధనలు కూడా మారుస్తూ ఉంటుంది. అయితే ఎటువంటి కారణం లేకుండా రైళ్లు ఆలస్యంగా రావడంతో చాలా సార్లు ప్రయాణికులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. రైలులో చైన్‌ లాగడం ప్రధానమైనది. చైన్ లాగడం వల్ల రైళ్లు తమ గమ్యస్థానాలకు చేరుకోవడంలో ఆలస్యమవుతుంది. ఈ క్రమంలో రైళ్లు అనవసరంగా ఆలస్యం కాకుండా చూసేందుకు భద్రతా బలగాలు ఆపరేషన్ ‘టైమ్ కీపింగ్’ కింద అలాంటి వారిపై నిఘా ఉంచాయి. రైలులో చైన్‌ లాగినందుకు ఎంతో మందిపై చర్యలు తీసుకుంటున్నారు రైల్వే అధికారులు. పెద్ద ఎత్తున జరిమానాలు సైతం విధిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Nita Ambani: నీతా అంబానీ తాగే వాటర్‌ బాటిల్‌ ధర రూ.27 వేలు ఉంటుందా? ఆ రూ.49 లక్షల బాటిల్‌ స్టోరీ ఏంటి?

కారణం లేకుండా చైన్ లాగితే శిక్ష ఏమిటి?

ఇవి కూడా చదవండి

ఒక ప్రయాణికుడు ఎటువంటి సరైన కారణం లేకుండా అనవసరంగా చైన్ లాగితే లేదా ఈ సౌకర్యాన్ని దుర్వినియోగం చేస్తే, అతనిపై రైల్వే చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవచ్చు. అలారం చైన్‌ని లాగడం వల్ల ఆ రైలుతో పాటు, ఆ ట్రాక్‌పై తర్వాత వచ్చే అన్ని ఇతర రైళ్లు కూడా ఆలస్యమవుతాయి. రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 141 ప్రకారం.. సరైన కారణం లేకుండా రైలు అలారం చైన్‌ను లాగితే రూ.1000 జరిమానా లేదా ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష విధించబడుతుంది. ఇది మాత్రమే కాదు.. ఇలా చేసే ప్రయాణికుడికి 1 సంవత్సరం జైలు శిక్షతో పాటు 1000 రూపాయల జరిమానా విధించబడుతుంది.

ఏ పరిస్థితుల్లో ట్రైన్‌లో చైన్ లాగవచ్చు:

  1. కదులుతున్న రైలులో మంటలు చెలరేగితే చైన్ పుల్లింగ్ ద్వారా రైలును ఆపవచ్చు.
  2. ప్రయాణ సమయంలో మీతో పాటు వృద్ధులు లేదా వికలాంగులు ఉంటే, వారు రైలు ఎక్కడానికి ఇబ్బంది పడుతుంటే, రైలు కదలడం ప్రారంభిస్తే అటువంటి పరిస్థితిలో అలారం చైన్ లాగడం కూడా చేయవచ్చు.
  3. మీతో పాటు చిన్న పిల్లవాడు ఉండి, వారిని స్టేషన్‌లో వదిలి రైలు కదలడం ప్రారంభిస్తే చైన్ పుల్లింగ్ కూడా చేయవచ్చు.
  4. ప్రయాణంలో ప్రయాణికుల ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణిస్తే, అటువంటి పరిస్థితులలో అలారం గొలుసును లాగవచ్చు.
  5. రైలు ప్రయాణంలో దొంగతనం లేదా దోపిడీ జరిగినప్పుడు చైన్ పుల్లింగ్ కూడా చేయవచ్చు.

ఇది కూడా చదవండి: Gold Price Today: బాబోయ్‌ ఒక్క రోజులోనే బంగారం ధర ఇంత పెరిగిందా? షాకిస్తున్న పసిడి రేట్లు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి