Indian Railways: కొన్ని రైల్వే స్టేషన్‌లను సెంట్రల్‌, టెర్మినల్‌, జంక్షన్‌ అని ఎందుకు పిలుస్తారో తెలుసా?

|

Oct 13, 2024 | 10:49 AM

Railway Station: మన దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే అది రైల్వే అని చెప్పక తప్పదు. ప్రపంచ వ్యాప్తంగా భారత రైల్వే నాలుగో స్థానంలో ఉంది. ప్రతిరోజు లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. అందుకు తగ్గట్లుగానే రైల్వే శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుంటుంది...

Indian Railways: కొన్ని రైల్వే స్టేషన్‌లను సెంట్రల్‌, టెర్మినల్‌, జంక్షన్‌ అని ఎందుకు పిలుస్తారో తెలుసా?
Follow us on

Railway Station: మన దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే అది రైల్వే అని చెప్పక తప్పదు. ప్రపంచ వ్యాప్తంగా భారత రైల్వే నాలుగో స్థానంలో ఉంది. ప్రతిరోజు లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. అందుకు తగ్గట్లుగానే రైల్వే శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుంటుంది. మీరు రైలులో ప్రయాణించినప్పుడు చాలా స్టేషన్లు వస్తుంటాయి. కొన్ని స్టేషన్‌లకు కొన్ని రకాల పేర్లు ఉంటాయి. ఆ స్టేషన్‌ పేరు పక్కన సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌ అని, టెర్మినల్ స్టేషన్, జంక్షన్, టెర్మినల్‌, సెంట్రల్‌ అనే పేర్లు ఉండటం మీరు గమనించే ఉంటారు. ఇలాంటి పేర్లు ఎందుకు పెడతారోనని మీరెప్పుడైనా గమనించారా? మరి అలాంటి స్టేషన్‌లకు అలాంటి పేర్లతో ఎందుకు పిలుస్తారో తెలుసుకుందాం. ముంబై సెంట్రల్, చెన్నై సెంట్రల్, కాన్పూర్ సెంట్రల్. స్టేషన్‌ పేర్లకు ఇలా ఎందుకు రాసి ఉంటుందో తెలుసుకుందాం.

సెంట్రల్ స్టేషన్ అంటే..

సెంట్రల్ స్టేషన్ అంటే ఆ నగరం అతి ముఖ్యమైన స్టేషన్ అని అర్థం. సెంట్రల్ స్టేషన్ నగరంలో అత్యంత ముఖ్యమైన రద్దీగా ఉండే స్టేషన్. ఈ స్టేషన్‌ల నుంచి ఎక్కువ మొత్తంలో రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయని అర్థం. అందుకే ఇలాంటి పెద్ద స్టేషన్‌లకు ముందు సెంట్రల్‌ అని పేరు ఉంటుంది. అంతేకాదు అత్యంత రద్దీగా ఉండే స్టేషన్‌లను కూడా ఇలా సెంట్రల్ పేరుతో గుర్తిస్తుంది రైల్వే శాఖ.

రద్దీగా ఎక్కువగా ఉన్న స్టేషన్‌లకు ఈ సెంట్రల్‌ అని పేరు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇక ఢిల్లీలో కూడా చాలా స్టేషన్లు ఉంటాయి. న్యూఢిల్లీ స్టేషన్ అత్యంత రద్దీగా ఉండే స్టేషన్. ఢిల్లీలో ఒక్క సెంట్రల్ స్టేషన్ కూడా లేదు. రైలు స్టేషన్‌, రైళ్ల రాకపోకలు, ప్రయాణికుల రద్దీ అన్నింటిని పరిగణలోకి తీసుకుని ఆస్టేషన్‌ను సెంట్రల్‌ అని పేరుతో సంబోధిస్తారు. భారతదేశంలో మొత్తం 5 సెంట్రల్ స్టేషన్లు ఉన్నాయి.

1. త్రివేండ్రం సెంట్రల్

2. కాన్పూర్ సెంట్రల్

3. మంగళూరు సెంట్రల్

4. ముంబై సెంట్రల్

5. చెన్నై సెంట్రల్.

టెర్మినస్/ టెర్మినల్ అంటే ఏమిటి?

ట్రాక్ లేదా మార్గం ముగిసినప్పుడు స్టేషన్‌ను టెర్మినస్ లేదా టెర్మినల్ అంటారు. టెర్మినల్ అర్థం ముగింపు. రైలు మరింత ముందుకు వెళ్లని స్టేషన్ ఇది. అంటే రైలు ఒక దిశలో మాత్రమే స్టేషన్‌లోకి ప్రవేశించవచ్చు లేదా బయలుదేరవచ్చు. ఇది ట్రాక్ ముగింపు అని కూడా అర్థం. ఇక్కడ ప్రతి ఇన్‌కమింగ్ ట్రాక్ స్టాప్-బ్లాక్‌ల వద్ద ముగుస్తుంది. అంటే ఈ స్టేషన్‌ మీదుగా ఇతర మార్గాలకు వెళ్లేందుకు వీలుండగా. ఇది ఛత్రపతి శివాజీ టెర్మినస్ / విక్టోరియా టెర్మినస్, లోకమాన్య తిలక్ టెర్మినల్ దేశంలోనే అతిపెద్ద టెర్మినల్ స్టేషన్లు.

జంక్షన్ అంటే ఏమిటి?

ఒక స్టేషన్ నుండి కనీసం 3 మార్గాలు వెళుతున్నట్లయితే ఆ స్టేషన్‌ను జంక్షన్ అంటారు. అంటే స్టేషన్‌లోకి వచ్చే రైళ్లు కనీసం రెండు అవుట్‌గోయింగ్ రైలు లైన్‌లను కలిగి ఉండాలి. ఎత్తైన మార్గాలను కలిగి ఉన్న జంక్షన్ మధుర. ఉదాహరణలు: సేలం జంక్షన్ నుండి ఆరు మార్గాలు, విజయవాడ నుండి ఐదు. అలాగే బరేలీ జంక్షన్ నుండి 5 మార్గాలు ఉన్నాయి.