Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways Rule: పొరపాటున ఈ తప్పులు చేయకండి.. జరిమానాతో పాటు జైలు శిక్ష

దేశంలో అతి పెద్ద రవాణా వ్యవస్థ అంటే అది రైల్వే అని చెప్పక తప్పదు. ప్రతి రోజు లక్షలాది మంది రైలు ప్రయాణాన్ని చేస్తుంటారు. ఛార్జీలు తక్కువగా ఉండటంతో చాలా మంది రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. సామాన్యులు సైతం..

Indian Railways Rule: పొరపాటున ఈ తప్పులు చేయకండి.. జరిమానాతో పాటు జైలు శిక్ష
Indian Railways
Follow us
Subhash Goud

|

Updated on: Jan 02, 2023 | 5:45 AM

దేశంలో అతి పెద్ద రవాణా వ్యవస్థ అంటే అది రైల్వే అని చెప్పక తప్పదు. ప్రతి రోజు లక్షలాది మంది రైలు ప్రయాణాన్ని చేస్తుంటారు. ఛార్జీలు తక్కువగా ఉండటంతో చాలా మంది రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. సామాన్యులు సైతం రైలులో ప్రయాణించేందుకు ఇష్టపడుతుంటారు. ప్రయాణికుల కోసం భారత రైల్వే శాఖ రకరకాల సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. అయితే రైలు ప్రయాణం చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయకడదు. లేకపోతే భారీ జరిమానా చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఇందు కోసం ఇండియన్‌ రైల్వే పలు రూల్స్‌ రూపొందించింది. మీరు ఈ నిబంధనలను విస్మరించినా లేదా తెలియక తప్పు చేసినా, మీరు భారీ జరిమానా చెల్లించవలసి ఉంటుంది. అంతేకాదు జైలుకు కూడా వెళ్ళవచ్చు. అటువంటి పరిస్థితిలో మీరు ఈ నియమాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.

  1. హాకింగ్: రైల్వే నిబంధనల ప్రకారం ఎవరైనా అనుమతి లేకుండా రైలు లేదా రైల్వే ప్రాంగణంలో వస్తువులను అమ్మినా అది నేరంగా పరిగణించబడుతుంది. అలా చేస్తే అతనిపై ఇండియన్ రైల్వే రూల్ సెక్షన్ 144 కింద కేసు నమోదు చేయవచ్చు. నేరం రుజువైతే ఒక వ్యక్తి 1 సంవత్సరం జైలు శిక్ష, 2 వేల రూపాయల వరకు జరిమానా చెల్లించవలసి ఉంటుంది.
  2. రెండవ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణానికి అనుమతి లేదు:
  3. కొందరు వ్యక్తులు తమ సీట్లు వదిలి ఇతర కోచ్‌లలో తమ కుటుంబం లేదా స్నేహితులతో కలిసి ప్రయాణించడం చాలా సార్లు జరుగుతుంది. అలాంటప్పుడు ఆ వ్యక్తిని రైల్వే చట్టం కింద ప్రాసిక్యూట్ చేయవచ్చు. దూర ప్రయాణ ఛార్జీతో పాటు రూ. 250 జరిమానా కూడా వసూలు చేయవచ్చు.
  4. బ్లాక్ టిక్కెట్లు: టిక్కెట్లను రైల్వే రిజిస్టర్డ్ కౌంటర్లు లేదా అధీకృత ఏజెంట్ల ద్వారా మాత్రమే విక్రయిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఎవరైనా ప్రయాణికుడికి అనుమతి లేకుండా టిక్కెట్‌ను విక్రయిస్తే అతనికి రైల్వే చట్టంలోని సెక్షన్ 143 ప్రకారం రూ. 10,000 జరిమానా, 3 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. వెయిటింగ్ టికెట్‌పై ప్రయాణం: రైల్వే వెయిటింగ్ టిక్కెట్‌పై ప్రయాణాన్ని అనుమతించదు. నిర్ధారిత టిక్కెట్‌పై మాత్రమే ప్రయాణం చేయవచ్చు. అలాగే రైలు రద్దు చేయబడితే, ఆ టిక్కెట్‌పై ప్రయాణం మరొక రైలులో కూడా అనుమతించబడదు. రైల్వే శాఖ నుంచి అనుమతులు వస్తే తప్ప ఇతర రైలులో ప్రయాణించేందుకు అనుమతి ఉండదు. అటువంటి పరిస్థితిలో ఎవరైనా ఇతర రైలులో ప్రయాణం చేస్తే TTE మీకు టిక్కెట్ డబ్బుతో పాటు పూర్తి ఛార్జీని వసూలు చేస్తారు. జరిమానా రూ. 250 ఉంటుంది. టీటీఈ మిమ్మల్ని తదుపరి స్టేషన్‌లో డ్రాప్ చేయవచ్చు.
  7. రైలు పైకప్పుపై ప్రయాణించినందుకు జరిమానా: ఒక ప్రయాణికుడు రైలు పైకప్పుపై కూర్చొని ప్రయాణిస్తే అతను జైలుకు వెళ్లవలసి ఉంటుంది. రైలు పైకప్పుపై ప్రయాణించడాన్ని నేరాల విభాగంలో పరిగణిస్తారు. రైల్వే చట్టంలోని సెక్షన్-156 ప్రకారం అతనిపై చర్యలు తీసుకోనున్నారు. ఇలాంటి కేసుల్లో 3 నెలల జైలు శిక్ష, రూ.500 వరకు జరిమానా విధించాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి