Indian Railways: తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్‌.. చర్లపల్లి – కామాఖ్య మధ్య కొత్త అమృత భారత్ ఎక్స్‌ప్రెస్

Indian Railways: ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు కొత్త అమృత భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి రానుంది. తెలంగాణ రాష్ట్రంలోని చర్లపల్లి, అసోం రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కామాఖ్య మధ్య స్లీపర్ , జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో కొత్త అమృత భారత్ ఎక్స్‌ప్రెస్..

Indian Railways: తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్‌.. చర్లపల్లి - కామాఖ్య మధ్య కొత్త అమృత భారత్ ఎక్స్‌ప్రెస్
New Amrit Bharat Exp

Updated on: Mar 10, 2026 | 2:08 PM

Indian Railways: ప్రయాణికుల సౌకర్యార్థం కోసం భారత రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పటికే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు విజయవంతంగా కొనసాగుతుండగా, ఇప్పుడు వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు కొత్త అమృత భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి రానుంది. తెలంగాణ రాష్ట్రంలోని చర్లపల్లి, అసోం రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కామాఖ్య మధ్య స్లీపర్ , జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో కొత్త అమృత భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు 13 మార్చి 2026 నుండి కామాఖ్య నుండి ప్రారంభం కానుంది.

ఈ కొత్త రైలు సేవ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అసోం రాష్ట్రంతో అనుసంధానిస్తుంది. అసోం రాష్ట్రం ఉత్తర–తూర్పు భారతదేశంలోని ఏడు రాష్ట్రాలకు ప్రవేశ ద్వారంగా భావించనున్నారు. ఈ రైలు ప్రారంభం వల్ల ముఖ్యంగా ఉత్తర–తూర్పు భారతదేశానికి ప్రయాణించే దూర ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణ సౌకర్యం లభిస్తుంది.

Schools Closes: అక్కడ సంచలన నిర్ణయం.. మార్చి 31 వరకు విద్యాసంస్థలు బంద్‌.. వారానికి 4 రోజులే పని!

ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ రాష్ట్రాల్లో ప్రయాణించే సమయంలో ఈ రైలు రెండు దిశల్లోనూ క్రింది స్టేషన్లలో ఆగుతుంది. శ్రీకాకుళం రోడ్, విజయనగరం జంక్షన్, పెందుర్తి, దువ్వాడ, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నల్గొండ ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Vande Bharat Sleeper: ఇక వెయిటింగ్‌ లిస్ట్‌ ఉండదు.. 260 వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us