Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: పొరపాటున ఈ 4 వస్తువులు రైలులో తీసుకెళ్తున్నారా? భారీ జరిమానాతో పాటు జైలుకు వెళ్లాల్సిందే

రైలులో ప్రయాణించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సామాన్యులు సైతం ఎక్కువ ప్రయాణించే రైలులో చాలా మంది లగేజీలు తీసుకెళ్తుంటారు. అయితే మీ లగేజీ ఎక్కువగా కనిపిస్తే..

Indian Railways: పొరపాటున ఈ 4 వస్తువులు రైలులో తీసుకెళ్తున్నారా? భారీ జరిమానాతో పాటు జైలుకు వెళ్లాల్సిందే
Indian Railways
Follow us
Subhash Goud

|

Updated on: Dec 21, 2022 | 9:42 AM

రైలులో ప్రయాణించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సామాన్యులు సైతం ఎక్కువ ప్రయాణించే రైలులో చాలా మంది లగేజీలు తీసుకెళ్తుంటారు. అయితే మీ లగేజీ ఎక్కువగా కనిపిస్తే టీటీఈ మీకు జరిమానా కూడా విధించవచ్చు. రైలులో ప్రయాణించేటప్పుడు నాలుగు వస్తువులను తీసుకెళ్లడం పూర్తిగా నిషేధించబడింది. తనిఖీల్లో వారి గురించి టీటీఈకి తెలిస్తే నేరుగా జైలుశిక్ష, ప్రత్యేకంగా భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. రైలులో మనం ఎప్పుడూ తీసుకెళ్లకూడని ఆ 4 వస్తువులు ఏమిటో తెలుసుకుందాం.

  1. యాసిడ్‌: రైలులో యాసిడ్ బాటిల్ తీసుకెళ్లడం పూర్తిగా నిషేధించబడింది. ఒక ప్రయాణికుడు ఇలా చేస్తూ పట్టుబడితే రైల్వే చట్టంలోని సెక్షన్ 164 కింద అతన్ని వెంటనే అరెస్టు చేయవచ్చు. ఈ సెక్షన్ కింద యాసిడ్ బాటిల్ తీసుకెళ్లినందుకు రూ.1,000 జరిమానా లేదా 3 ఏళ్ల జైలు శిక్ష విధించవచ్చు. అందుకే మీరు రైలులో ఎప్పుడూ అలాంటి పొరపాటు చేయకుండా ప్రయత్నించండి.
  2. స్టవ్, గ్యాస్ సిలిండర్: ఇతర ప్రాంతాల్లో పని చేసే వారు ఇంటికి తిరిగి వచ్చే సమయంలో తమతో పాటు స్టవ్‌లు, సిలిండర్లు కూడా తీసుకెళ్తుంటారు. రైలులో గ్యాస్ సిలిండర్లు, స్టవ్‌లను తీసుకెళ్లడం రైల్వే చట్టం ప్రకారం చట్టవిరుద్ధం. అలాగే రైలులో ఖాళీ సిలిండర్‌ను తీసుకెళ్లాలని భావిస్తే రైల్వే అధికారుల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. నింపిన సిలిండర్ దొరికితే జైలు శిక్ష, కఠినమైన జరిమానాను ఎదుర్కొవలసి ఉంటుంది.
  3. క్రాకర్స్: ట్రైన్‌లలో పటాకులు తీసుకెళ్లడం పూర్తిగా నిషేధించబడింది. పటాకులు పేలడం వల్ల రైలులో మంటలు చెలరేగి ప్రాణ నష్టం వాటిల్లుతుంది. ఎవరైనా రైలులో పటాకులు తీసుకెళ్తుంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవచ్చు. అతనికి భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించవచ్చు. అందువల్ల, మీరు కూడా అలాంటి పొరపాటు ఎప్పుడూ చేయకూడదు.
  4. ఆయుధాలు: మీరు రైలులో లైసెన్స్ పొందిన ఆయుధాలు తప్ప కత్తి, రైఫిల్ లేదా మరే ఇతర ప్రాణాంతక ఆయుధాన్ని తీసుకెళ్లలేరు. ఇలా చేయడం ద్వారా రైల్వే చట్టం, ఆయుధ చట్టం కింద మీపై కేసు నమోదు చేయడం ద్వారా వెంటనే చర్య ప్రారంభించవచ్చు. దీని కోసం మీరు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు అలాంటి ఆయుధాల నుండి దూరం ఉంచి ప్రయాణం చేస్తే మంచిది.
  5. ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఓటములు నేర్పిన పాఠాలు.. ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో ర్యాంకు
ఓటములు నేర్పిన పాఠాలు.. ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో ర్యాంకు
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?