Indian Railways: ఇండియన్‌ పోస్ట్‌, రైల్వేలు సంయుక్తంగా అందుబాటులోకి కొత్త సేవలు.. ఇకపై ఇంటి వద్దకే పార్శిల్స్‌.

|

Feb 17, 2023 | 8:25 AM

ప్రయాణికులకు మరింత చేరువయ్యే క్రమంలో ఇండియన్‌ రైల్వే కొత్త సేవలను ప్రారంభించింది. రైల్ పోస్ట్ గతి శక్తి ఎక్స్‌ప్రెస్ కార్గో సర్వీస్‌ను కాచిగూడ నుంచి గురువారం ప్రారంభించారు. భారతీయ రైల్వేలు, ఇండియా పోస్ట్ సంయుక్తంగా ఈ పార్శిల్ సేవలను ప్రారంభించింది...

Indian Railways: ఇండియన్‌ పోస్ట్‌, రైల్వేలు సంయుక్తంగా అందుబాటులోకి కొత్త సేవలు.. ఇకపై ఇంటి వద్దకే పార్శిల్స్‌.
Indian Railways
Follow us on

ప్రయాణికులకు మరింత చేరువయ్యే క్రమంలో ఇండియన్‌ రైల్వే కొత్త సేవలను ప్రారంభించింది. రైల్ పోస్ట్ గతి శక్తి ఎక్స్‌ప్రెస్ కార్గో సర్వీస్‌ను కాచిగూడ నుంచి గురువారం ప్రారంభించారు. భారతీయ రైల్వేలు, ఇండియా పోస్ట్ సంయుక్తంగా ఈ పార్శిల్ సేవలను ప్రారంభించింది. వినియోగదారులకు డోర్ టు డోర్ పార్శిల్ సేవను అందించడమే ఈ సేవల లక్ష్యం. ఇంటివద్ద నుంచి పార్శిల్‌ లోడింగ్ చేసే స్థలం వరకు, పార్శిల్‌ అన్ లోడింగ్ చేసే స్థలం నుంచి వినియోగదారుల ఇంటికి తపాలా శాఖ అందిస్తుంది.

కస్టమర్ల పార్శిల్ సరుకులను ఇంటివద్దకు సురక్షితంగా చేర్చేందుకు ఈ పార్శిల్‌ల యాంత్రిక హ్యాండ్లింగ్‌ విధానంలో నిర్వహిస్తుంది. కమర్షియల్‌ పార్శిల్స్‌ను ఇంటి వద్దకు సురక్షితంగా చేర్చేందుకు, సేకరించి ప్యాకెట్ల నిల్వ, రవాణా చేయడానికి, మెష్‌ బాక్సులను ఉపయోగిస్తారు. రైల్‌ పోస్ట్‌ గతిశక్తి ఎక్స్‌ప్రెస్‌ కార్గో సర్వీస్‌ క్రమం తప్పకుండా రేణిగుంట నుంచి హజ్రత్‌ నిజాముద్దీన్‌ వరకు వారానికి నాలుగు సార్లు నడుస్తుంది.

భారత పోస్ట్‌తో పాటు రైల్ పోస్ట్ గతి శక్తి ఎక్స్‌ప్రెస్ కార్గో సర్వీస్‌ను అమలులోకి తెచ్చినందుకు కమర్షియల్ అండ్‌ ఆపరేటింగ్ బృందాన్ని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ అభినందించారు. కస్టమర్లకు డోర్ టు డోర్ పార్శిల్ సర్వీస్‌ను అందించడం ద్వారా పార్శిళ్ల రవాణాలో ఈ సేవ నూతన శకంగా మారుతుందని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..