Indian Passport Colours: భారతదేశంలో ఈ 4 రంగులలో జారీ చేసే పాస్‌పోర్ట్‌ల అర్థం ఏమిటి?

Indian Passport Colours: ఈ రంగు పాస్‌పోర్ట్ కలిగి ఉన్నవారు విదేశాల్లో పనిచేసే వ్యక్తులకు జారీ చేస్తారు. తక్కువ విద్యార్హతల ఆధారంగా విదేశాలకు ప్రయాణించే వారికి ఇది తరచుగా జారీ చేస్తారు. ఈ రకమైన పాస్‌పోర్ట్ కలిగి ఉన్నవారు విదేశాలకు ప్రయాణించే..

Indian Passport Colours: భారతదేశంలో ఈ 4 రంగులలో జారీ చేసే పాస్‌పోర్ట్‌ల అర్థం ఏమిటి?

Updated on: Aug 25, 2025 | 7:47 PM

Indian Passport Colours: భారతదేశంలో పాస్‌పోర్ట్ చాలా ముఖ్యమైన గుర్తింపు పత్రం. ఇది ఒక వ్యక్తి పేరు, చిరునామా, పౌరసత్వం మొదలైన ముఖ్యమైన సమాచారాన్ని కలిగి ఉంటుంది. భారతదేశం దాటి విదేశాలకు ప్రయాణించేటప్పుడు ఈ పత్రం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే పాస్‌పోర్ట్‌లో మన ప్రయాణ వివరాలతో సహా అంతా సమాచారం ఉంటుంది. దీని కారణంగా భారతదేశంలో పాస్‌పోర్ట్‌లను జారీ చేయడంలో కేంద్ర ప్రభుత్వం వివిధ భద్రతా చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం భారతదేశంలో అవి నాలుగు రంగులలో జారీ చేస్తారు. నీలం, తెలుపు, మెరూన్, నారింజ. ప్రతి రంగుకు ప్రయాణానికి ప్రత్యేకమైన కారణం, ఉద్దేశ్యం ఉంది. వాటి ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: Washing Powder Nirma: ఒకప్పుడు దేశాన్ని ఏలిన ‘నిర్మా’ ఇప్పుడు ఏమైపోయింది..? ఒక తప్పు వల్ల కనుమరుగు

నీలి రంగు పాస్‌పోర్ట్:

ఇవి కూడా చదవండి

భారతదేశంలో నీలిరంగు పాస్‌పోర్ట్ సర్వసాధారణం. ఇది అత్యంత విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇది సాధారణ పౌరులకు విదేశాలకు ప్రయాణించడానికి జారీ చేస్తారు. పర్యాటకం, వ్యాపారం, విద్యతో సహా అన్ని రకాల ప్రయాణాలకు ఇది ఉపయోగపడుతుంది. చాలా మంది భారతీయులు ఈ పాస్‌పోర్ట్‌ను ఉపయోగిస్తారు.

తెల్ల పాస్‌పోర్ట్:

ఇది ప్రభుత్వ అధికారులు, భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తులకు జారీ చేస్తారు. ఇది దౌత్య కార్యకలాపాలు, అధికారిక ప్రయాణాలలో ఉన్నవారికి కూడా వర్తిస్తుంది. ఈ తెల్ల పాస్‌పోర్ట్ కలిగి ఉన్నవారు ఫాస్ట్-ట్రాక్ విమానాశ్రయ క్లియరెన్స్ వంటి అనేక అధికారాలను పొందుతారు.

మెరూన్ పాస్‌పోర్ట్:

ఈ రకమైన పాస్‌పోర్ట్‌ను భారత దౌత్యవేత్తలు, ఉన్నత స్థాయి అధికారులు, సీనియర్ ప్రభుత్వ అధికారులకు జారీ చేస్తారు. ఈ రకమైన పాస్‌పోర్ట్ కాన్సులర్ భద్రత, అంతర్జాతీయ అధికారాలను అందిస్తుంది. దీని ద్వారా ప్రయాణికులు ప్రపంచ భద్రతను పొందుతారు.

నారింజ రంగు పాస్‌పోర్ట్:

ఈ రంగు పాస్‌పోర్ట్ కలిగి ఉన్నవారు విదేశాల్లో పనిచేసే వ్యక్తులకు జారీ చేస్తారు. తక్కువ విద్యార్హతల ఆధారంగా విదేశాలకు ప్రయాణించే వారికి ఇది తరచుగా జారీ చేస్తారు. ఈ రకమైన పాస్‌పోర్ట్ కలిగి ఉన్నవారు విదేశాలకు ప్రయాణించే ముందు అదనపు పౌరసత్వ తనిఖీలు చేయించుకోవాలి. భారతదేశంలో పాస్‌పోర్ట్‌లు వేర్వేరు రంగుల్లో ఉన్నాయని గమనించాలి. ఈ రకమైన పాస్‌పోర్ట్ ప్రయాణ ఉద్దేశ్యాన్ని సూచించడానికి జారీ చేస్తారు. దీని కారణంగా విమానాశ్రయాలలో తనిఖీ పద్ధతులు మారుతూ ఉంటాయి. ఇది విదేశాలకు ప్రయాణించేటప్పుడు భారతీయులకు ప్రత్యేక విధానాన్ని అందిస్తుంది. ఇప్పుడు మీరు పాస్‌పోర్ట్ పొందినప్పుడు అది ఏ రంగులో ఉంటుంది? అది ఏ ప్రయోజనం కోసం జారీ చేయబడుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఇది కూడా చదవండి: School Holiday: విద్యార్థులకు తీపి కబురు.. తెలుగు రాష్ట్రాల్లో బుధవారం పాఠశాలలు బంద్‌!

BSNL అద్భుతమైన ప్లాన్.. రూ.147కే 30 రోజుల వ్యాలిడిటీ.. అన్ని బెనిఫిట్స్‌!

 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి