AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio Recharge Plan: రిలయన్స్ జియో ఈ ప్లాన్ కూడా నిలిపివేసిందా?

Jio Recharge Plan: రిలయన్స్ జియో ఈ ప్లాన్ కూడా నిలిపివేసిందా?

Phani CH
|

Updated on: Aug 25, 2025 | 7:48 PM

Share

దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ ప్లాన్‌లలో మార్పులు చేస్తోంది. ఇప్పటికే రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్‌ను తొలగించిన జియో.. తాజాగా రూ.799 ప్లాన్‌ను కూడా నిలిపివేసిందంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ ప్లాన్‌ ద్వారా 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు పొందుతున్నారు.

అయితే, జియో ఈ ప్లాన్‌ను కూడా నిలిపివేసిందని, ఇకపై అదే ప్రయోజనాల కోసం వినియోగదారులు రూ.889 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుందని ప్రచారం జరిగింది. దీంతో జియో వినియోగదారులలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో రూ.799 ప్లాన్‌ రద్దుచేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని జియో తోసిపుచ్చింది. ఆ ప్లాన్ కొనసాగుతుందని, యూజర్లు ఎప్పటిలానే రీఛార్జి చేసుకోవచ్చని స్పష్టతనిచ్చింది. జియో వెబ్‌సైట్‌తో పాటు ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీఎం వంటి పేమెంట్‌ ప్లాట్‌ఫామ్‌లలో ఈ ప్లాన్‌ తో అందుబాటులోనే ఉంచినట్లు వివరణ ఇచ్చింది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా, అందుబాటు ధరలో రీఛార్జి ప్లాన్లను అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు జియో పేర్కొంది. రూ.799 రీఛార్జి ప్లాన్ తో రీఛార్జి చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చని, రోజుకు 1.5 జీబీ డేటాతో పాటు అపరిమిత కాల్స్ చేసుకోవచ్చని వివరించింది. అదేవిధంగా ఈ ప్లాన్ లో రోజుకు వంద ఎస్ఎంఎస్ లు పొందవచ్చని కంపెనీ పేర్కొంది. దీంతోపాటు మరో ప్రత్యామ్నాయంగా రూ.666 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా ఉంది. ఈ ప్లాన్‌లో 70 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5 GB డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు JioCinema లేదా Hotstar Mobile/TV సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఈ ప్లాన్‌కు కూడా 5G సదుపాయం లేదు. గత ఏడాది నుంచి రోజుకు 2GB డేటా అందించే ప్లాన్‌లకే జియో 5G సదుపాయాన్ని అందిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

NTR సినిమాపై నారా రోహిత్ కుట్ర.. క్లారిటీ

సినిమాలు మానేసి.. జాతకాలు చెప్పుకుంటున్న హీరోయిన్

ఓవర్ యాక్షన్ ఎఫెక్ట్.. బిగ్‌బాస్‌కు రాకుండా గెంటేసిన జడ్డెస్

దేవుడి సినిమా దెబ్బకి చిత్తవుతున్న వార్ 2, కూలీ

ఆ సీన్‌లో లాజిక్కేది ?? వార్ 2పై RGV షాకింగ్ రివ్యూ