Digital Rupee: చైనా అనుభవంతో ముందే మేల్కొన్న భారత్.. డిజిటల్ రూపీతో ముందడుగు..

|

Feb 12, 2022 | 2:12 PM

Digital Payments: డిజిటల్ చెల్లింపుల విషయంలో పేమెంట్ గేట్ వే(Payment Gate Way) సేవలు అందిస్తున్న పేటిఎం(Pay TM), జీ పే(G Pay), పేటిఎం(Pay TM) వంటి సంస్థలు సింహ భాగాన్ని అందిపుచ్చుకున్నాయి. ఈ విభాగంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పాత్ర...

Digital Rupee: చైనా అనుభవంతో ముందే మేల్కొన్న భారత్.. డిజిటల్ రూపీతో ముందడుగు..
Digital Ruppee
Follow us on

Digital Rupee: డిజిటల్ చెల్లింపుల విషయంలో పేమెంట్ గేట్ వే(Payment Gate Way) సేవలు అందిస్తున్న ఫోన్ పే(Phone Pe), జీ పే(G Pay), పేటిఎం(Pay TM) వంటి సంస్థలు సింహ భాగాన్ని అందిపుచ్చుకున్నాయి. ఈ విభాగంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పాత్ర నామమాత్రమేనని చెప్పుకోక తప్పదు. ఇలా ప్రైవేటు సంస్థలు సేవలు అందించడం వల్ల ఎంతో విలువైన వినియోగదారుల వ్యక్తిగత సమాచారం సదరు సంస్థలకు చేరుతోంది. దానిని దుర్వినియోగం కాకుండా చూడడం ప్రస్తుతం భారత ప్రభుత్వపై ఉన్న అతిపెద్ద సవాలు. దీనిని దృష్టిలోకి తీసుకున్న కేంద్రం రిజర్వు బ్యాంకు ఆధ్వర్యంలో నడిచే పేమెంట్ గేట్ వే ను తీసుకురావాలని యోచించింది. దీనికి సంబంధించి డిజిటల్ రూపీ ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తాజా బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇదే విషయాన్ని ఆర్బీఐ వర్గాలు సైతం నిన్న ధృవీకరించాయి. డిజిటల్ రూపీ మనం మామూలుగా వినియోగించే కరెన్సీ లాగానే పనిచేస్తుందని.. దానిని ఒకరినుంటి మరొకరికి డిజిటల్ గా బదిలీ చేసుకోవచ్చని వెల్లడించింది.

చైనాలో ప్రైవేటు పేమెంట్ గేట్ వే సేవలు అందిస్తున్న ఆలీబాబా సంస్థకు చెందిన ఆలీపే, టెన్ సెంట్ సంస్థకు చెందిన వీచాట్ పే సేవలపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. దీనికి ప్రత్యామ్నాయంగా ఏప్రిల్ 2020లో చైనా సెంట్రల్ బ్యాంక్ సొంతంగా యువాన్ పే ను అందుబాటులోకి తెచ్చింది. చైనా ప్రభుత్వం తెచ్చిన e-CNY కింద ఇప్పటికే 261 మిలియన్ మంది అక్కడి ప్రజలు చెల్లింపులు చేసేందుకు వినియోగిస్తున్నారు. తాజాగా వింటర్ ఒలంపిక్స్ లో పాల్గొనేందుకు చైనాకు వచ్చే వేలాది మంది విదేశీయులకు సైతం దీనిని పరిచయం చేయాలని అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. గడచిన ఆరు నెలల కాలంలో దీని వినియోగం గణనీయంగా పెరిగింది. రోజూ యువాన్ పే ద్వారా సుమారు ఎనిమిది బిలియన్ డాలర్ల వరుకు చెల్లింపులు జరుగుతున్నాయి. ఇది చైనాలో రోజూ జరిగే భౌతిక నగదు చెల్లింపుల్లో చాలా తక్కువేనని తెలుస్తోంది. ప్రైవేటు డిజిటల్ చెల్లింపు సంస్థలపై ఉన్న నమ్మకాన్ని తగ్గించేదుకు చైనా ప్రభుత్వం ఇలా చేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

భారత ప్రభుత్వం కొత్తగా తెస్తున్న డిజిటల్ రూపీ ని ప్రజలకు చేరువ చేసేందుకు దేశంలోని వివిధ దేశీయ బ్యాంకులను భాగస్వాములుగా చేసి ముందుకు వెళుతోంది. ఇందుకోసం సురక్షితమైన బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగిస్తోంది. సహజంగా క్రిప్టో కరెన్సీలు ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగిస్తుంటాయి. కానీ అవి ప్రైవేటు సంస్థలకు చెందినది. ఎటువంటి ప్రభుత్వ గ్యారెంటీ లేనిది. డిజిటల్ రూపీ మాత్రం భారత ప్రభుత్వ ఆమోదంతో సేవలు అందించేందుకు ఆర్భీఐ సిద్ధం చేస్తున్న సురక్షిత డిజిటల్ చెల్లింపుల విధానం. ఇలా ప్రభుత్వం ప్రజలకు డిజిటల్ వాలెట్ విధానంలో చెల్లింపులకు వ్యవస్థను తీసుకురానుంది. దీని ద్వారా దేశంలో నిధులు ఎలా చేతులు మారుతున్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నాయి, ప్రజలు వేటిపై ఎలా ఖర్చు చేస్తున్నారు, ప్రజల ఆర్థిక స్థితిగతులు వంటి అనేక అంశాలకు సంబంధించిన వివరాలను సేకరించి తదనుగుణంగా వినియోగించుకోనుంది. ఇలా ప్రజలకు సేవలు అందించటమే కాకుండా వారి విలువైన వ్యక్తిగత సమాచారాన్ని రక్షించటంతో పాటు డిజిటల్ చెల్లింపులు ప్రైవేటు సంస్థలపై ఆదారపడడాన్ని తగ్గించనుంది. ఇలా చేయటం వల్ల దేశంలో డిజిటల్ చెల్లింపులకు మరింతగా ఊతం అందుతుందని భారత ప్రభుత్వం భావిస్తోంది.

ఇవీ చదవండి..

Nawab Family For 2600 Crores: పూర్వీకుల ఆస్తి కోసం 50 ఏళ్ల న్యాయపోరాటం.. రూ. 2600 కోట్ల ఆస్తి దక్కించికున్న వారసులు.. ఎలాగంటే..

Vijay Mallya – Supreme Court: నీకిదే లాస్ట్ ఛాన్స్.. విజయ్ మాల్యాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఎందుకోసమంటే..!