RBI On Coronavirus: కరోనాతో భారీగా ఆర్ధిక నష్టం.. కోలుకోవాలంటే 12 ఏళ్లు పడుతుందంటున్న ఆర్బీఐ

|

May 02, 2022 | 6:50 AM

RBI On Coronavirus: కొవిడ్ -19 కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ చాలా నష్టపోయిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశోధన బృందం అంగీకరించింది. కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన నష్టాల(Covid Losses) నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి చాలా కాలం పట్టనున్నట్లు అంచనా వేసింది.

RBI On Coronavirus: కరోనాతో భారీగా ఆర్ధిక నష్టం.. కోలుకోవాలంటే 12 ఏళ్లు పడుతుందంటున్న ఆర్బీఐ
Rbi
Follow us on

RBI On Coronavirus: కొవిడ్ -19 కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ చాలా నష్టపోయిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశోధన బృందం అంగీకరించింది. కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన నష్టాల(Covid Losses) నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి 12 సంవత్సరాలు (2034-2035) పట్టవచ్చని RBI అంచనా వేసింది. ఆర్‌బీఐ శుక్రవారం ‘కరెన్సీ అండ్ ఫైనాన్స్ 2021-22’ నివేదికను విడుదల చేసింది. సెంట్రల్ బ్యాంక్ పరిశోధనా బృందం దీనిని తయారు చేసింది. 3 సంవత్సరాల్లో దేశానికి 50 లక్షల కోట్ల కంటే ఎక్కువ ఉత్పత్తి నష్టం జరిగినట్లు అంచనా వేసింది. 2020-21లో రూ. 19.1 లక్షల కోట్లు, 2021-22లో రూ. 17.1 లక్షల కోట్లు, 2022-23లో రూ. 16.4 లక్షల కోట్ల నష్టాన్ని అంచనా వేసింది. దేశంలో డిజిటలైజేషన్‌ను(Digitalization) ప్రోత్సహించడం, ఇ-కామర్స్, స్టార్టప్‌లు, పునరుత్పాదక, సప్లై చైన్ లాజిస్టిక్స్ వంటి రంగాల్లో కొత్త పెట్టుబడి అవకాశాలను పెంచడం కూడా వృద్ధికి దోహదపడుతోందని నివేదిక పేర్కొంది.

COVID-19 మహమ్మారి వరుస వేవ్స్  కారణంగా ఆర్థిక పునరుద్ధరణ ప్రభావితమవుతోందని పేర్కొంది. జూన్ 2020 త్రైమాసికంలో హెవీ ష్రింక్ తర్వాత.. రెండవ వేవ్ వచ్చే వరకు ఆర్థిక పునరుద్ధరణ బుల్లిష్‌గా ఉంది. అదేవిధంగా.. జనవరి 2022లో మూడవ వేవ్ కారణంగా రికవరీ ప్రక్రియ పాక్షికంగా ప్రభావితమైంది. మహమ్మారి ఇంకా ముగియలేదని.. ముఖ్యంగా చైనా, దక్షిణ కొరియా, యూరప్ లోని అనేక ప్రాంతాల్లో తాజా పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నప్పుడు. కరోనా వేవ్స్ వల్ల ఆర్థిక వ్యవస్థ ప్రభావితమౌతోందని తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా తలెత్తిన పరిస్థితులపై పరిశోధన బృందం ఆందోళన వ్యక్తం చేసింది. సరఫరా పరిమితులు, పెరిగిన డెలివరీ సమయాలు షిప్పింగ్ ఖర్చులు వస్తువుల ధరలను పెంచాయని పేర్కొంది. ఇది ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమై ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పునరుద్ధరణను ప్రభావితం చేసింది. ప్రపంచ సరఫరా గొలుసు సమస్యలతో భారత్ కూడా పోరాడుతోంది. సుదీర్ఘ డెలివరీ సమయాలు, అధిక ముడిసరుకు ధరలు దేశీయ సంస్థల లాభాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

ఈ తరుణంలోనే IMF భారత్ పై తన GDP అంచనాను కూడా తగ్గించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి GDP అంచనాను 80 బేసిస్ పాయింట్లు తగ్గించి 8.2%కి పరిమితం చేసింది. ముందుగా జనవరిలో IMF 9% వృద్ధిని అంచనా వేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వృద్ధి అంచనాలను సవరించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముడి చమురు ధరలను పెంచటం వల్ల దేశీయ వినియోగం, ప్రైవేట్ పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతోందని IMF అభిప్రాయపడింది. మరో పక్క ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2023లో 3.6% వృద్ధి చెందవచ్చని లెక్కగట్టింది. ఇది మునుపటి అంచనా కంటే 20 బేసిస్ పాయింట్లు తక్కువ. ఉక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా ప్రపంచ ఆర్థిక అవకాశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని IMF చీఫ్ ఎకనామిస్ట్ పియర్-ఒలివియర్ గౌరెన్‌చస్ అన్నారు. యుద్ధం సరఫరా గొలుసు సమస్యలను మరింత తీవ్రతరం చేసింది. భూకంప తరంగాల వలె, దాని ప్రభావం చాలా దూరం ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Yes Bank: నాలుగో త్రైమాసికం ఫలితాలు విడుదల చేసిన యెస్‌ బ్యాంక్‌.. 2019 తర్వాత మొదటిసారి లాభాల్లోకి..

Cement: పెరుగుతోన్న సిమెంట్‌ ధరలు.. నిర్మాణ రంగంపై మరింత పెరగనున్న భారం..