Currency Notes: భారతీయ కరెన్సీలో చాలా రకాల నోట్లు ఉన్నాయి. ప్రతి నోటుకి అనేక రకాల భద్రతా లక్షణాలు ఉంటాయి. ఈ సెక్యూరిటీ ఫీచర్ల ద్వారా ఆ నోట్ నిజమైనదా లేదా నకిలీదా గుర్తించవచ్చు. నోట్ తయారు చేయడానికి స్పెషల్ సిరా, ప్రింటింగ్ ఉపయోగిస్తారు. దీని కారణంగా ఈ నోట్లు సాధారణ పేపర్‌ల కంటే భిన్నంగా ఉంటాయి. ఒకరి నుంచి కరెన్సీ నోట్స్ తీసుకునేటప్పుడు చాలా విషయాలు గమనించాలి. మీరు ఎప్పుడైనా రెండు వేల నోట్ చివర నల్లటి గీతలను గమనించారా?
ఈ గీతల ప్రత్యేకత ఏమిటి?
రూ.100 నుంచి రూ.2000 కరెన్సీ నోట్లపై ఈ గీతలు ఉంటాయి. వీటిని ప్రత్యేకంగా రూపొందిస్తారు. ప్రతి నోట్‌పై వేర్వేరు అర్థాలను కలిగి ఉంటాయి. వాస్తవానికి వీటిని అంధులను దృష్టిలో ఉంచుకుని ముద్రించారు. ఈ ప్రింటింగ్‌ను INTAGLIO లేదా ఎంబోస్డ్ ప్రింటింగ్ అంటారు. మీరు ఈ నోట్ తీసుకొని నల్లటి గీతలను తాకినప్పుడు అది కొద్దిగా పైకి లేస్తుంది. తద్వారా అంధుడు ఆ కరెన్సీ నోట్ గురించి తెలుసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన ముద్రణతో కరెన్సీ నోట్‌లో మహాత్మా గాంధీ ఫోటో, అశోక స్థూపం, నల్ల గీతలు, మొదలైన అనేక గుర్తులను ముద్రిస్తారు. ఈ బ్లాక్ లైన్స్ కూడా ఈ ప్రింటింగ్ తోనే ముద్రిస్తారు. వాటిని చేతితో తాకి ఎన్ని రూపాయల నోటో గుర్తించవచ్చు.
ఏ నోట్లో ఎన్ని లైన్లు ఉంటాయి..
100 రూపాయల నోటులో 4 లైన్లు ఉంటాయి. ఇందులో 2-2 సెట్లలో 4 లైన్లు ఉంటాయి. 200 రూపాయల నోట్లో 4 లైన్లు మాత్రమే ఉంటాయి. ఇందులో 2-2 సెట్‌లు ఉంటాయి. కానీ ఈ 2-2 లైన్ల మధ్య 2 చుక్కలు కూడా ఉంటాయి. దీన్ని బట్టి అది 200 రూపాయల నోటు అని అర్థమవుతుంది. 500 రూపాయల నోటులో 5 లైన్లు ఉంటాయి. అవి 2-1-2 సెట్లలో ఉంటాయి. 2000 రూపాయల నోటులో7 లైన్లు ఉంటాయి. అవి 1-2-1-2-1 సెట్‌లో ఉంటాయి.