Indian Consumers: రూట్ మార్చిన భారతీయ వియోగదారులు.. ఆర్థిక భద్రత కోసం మరింత పొదుపు..
భారతీయవినియోగదారులు(Indian Consumers) తమ రూట్ మార్చినట్లు తెలుస్తుంది. చాలా మంది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మరింత పొదుపు(Savings) చేస్తున్నారు...
భారతీయవినియోగదారులు(Indian Consumers) తమ రూట్ మార్చినట్లు తెలుస్తుంది. చాలా మంది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మరింత పొదుపు(Savings) చేస్తున్నారు. అదే సమయంలో అనవసర ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని డెలాయిట్ కన్స్యూమర్(deloitte consumer) ట్రాకర్ నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం భారతీయ వినియోగదారులు తమ షాపింగ్, వినోదం, అభిరుచులపై చేసే ఖర్చులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని తర్వాత ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, రెస్టారెంట్లకు వెల్లడానికి ఇష్టపడుతున్నట్లు నివేదిక పేర్కొంది. వినియోగదారుల సెంటిమెంట్ ఇప్పుడు సానుకూలంగా మారిందని విశ్లేషణలు చెబుతున్నాయని నివేదిక పేర్కొంది. కార్పొరేట్ ఇండియాలో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయని, ప్రయాణ ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. అటువంటి పరిస్థితిలో భారతీయ వ్యాపారాలు యాత్రకు సిద్ధమవుతున్నాయి.
సర్వే ప్రకారం, దాదాపు 83 శాతం మంది భారతీయులు వచ్చే మూడు నెలల్లో వ్యాపార పర్యటనలకు వెళ్లనున్నారు. సర్వేలో పాల్గొన్న చాలా మంది వినియోగదారులు రాబోయే మూడు సంవత్సరాలలో వారి ఆర్థిక పరిస్థితి గురించి ఆశాజనకంగా కనిపించారని నివేదిక తెలిపింది. భారతీయ వినియోగదారులు ఇప్పుడు భవిష్యత్తు కోసం పొదుపుపైఎక్కువ దృష్టి సారిస్తున్నారని చెప్పింది. 2022 మొదటి మూడు నెలలు సాహసోపేతమైన రోలర్-కోస్టర్ రైడ్ అని, భారతీయులు COVID-19 థర్డ్ వేవ్ చూస్తున్నారని పేర్కొంది. ఈ మహమ్మారి వల్ల ప్రజలు ఖర్చు విషయంలో జాగ్రత్త పడుతున్నారని. బీమా ఉత్పత్తులతో విచక్షణతో కూడిన ఖర్చును తగ్గించుకోవడం ద్వారా భారతీయులు ఆర్థిక భద్రతపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారని వివరించింది.
ఇది కాకుండా, ప్రజలు తమ సంపాదనలో సగం ఆర్థిక భద్రత కోసం పొదుపు చేస్తున్నట్లు వివరించారు. భారతీయులు తమ సంపాదనలో 50 శాతాన్ని పొదుపు, పెట్టుబడులు, బీమా ద్వారా ఆర్థిక భద్రత కోసం వెచ్చిస్తున్నారని సర్వే పేర్కొంది. 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి 1.2 కోట్ల ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం ఉపాధి అవకాశాలలో, 17 శాతం అధిక నైపుణ్యం, ప్రత్యేక నిపుణులైన ఉద్యోగులు లేదా వృత్తిపరమైన కార్మికులకు అందుబాటులో ఉంటుంది. ఇంజినీరింగ్, టెలికాం, హెల్త్‌కేర్ రంగాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
Read Also.. Multibagger stock: ఇన్వెస్టర్ల సంపదను 87 రెట్లు పెంచిన అదానీ షేర్.. మీ దగ్గర ఉందా..?