Crude Oil: ఆయిల్ ధరలతో లాభపడనున్న ఆ వ్యాపారవేత్త.. కొత్తగా దేశంలో భారీ పెట్టుబడులు..

Crude Oil: అంతర్జాతీయంగా పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ రేట్లను తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో ఉన్నాడు ఆ భారతీయ వ్యాపార వేత్త. దీనికోసం కొత్తగా బిలియన్ల కొద్దీ పెట్టుబడులు పెట్టనున్నాడు.

Crude Oil: ఆయిల్ ధరలతో లాభపడనున్న ఆ వ్యాపారవేత్త.. కొత్తగా దేశంలో భారీ పెట్టుబడులు..
Crude oil

Updated on: Mar 13, 2022 | 8:26 AM

Crude Oil: అంతర్జాతీయంగా పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ రేట్లను తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో ఉన్నాడు ఆ భారతీయ వ్యాపార వేత్త. దీనికోసం కొత్తగా బిలియన్ల కొద్దీ పెట్టుబడులు పెట్టనున్నాడు. ఇంతకీ విషయం ఏమిటంటే.. బిలియనీర్ వ్యాపారవేత్త అనిల్ అగర్వాల్(Anil Agarwal) నేతృత్వంలోని కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ లిమిటెడ్(Cairn Oil & Gas) తన ఉత్పత్తిని మూడు రెట్లు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం రాబోయే మూడేళ్లలో 4 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేయాలని భావిస్తోంది. దీని వెనుక ఉన్న ప్రధాన కారణం ముడి చమురు ధరలు పెరిగి ఆకర్షణీయంగా మారటమే. దేశంలోని 51 బ్లాకుల్లో కొత్త చమురు, గ్యాస్ నిల్వలను కనుగొనడానికి మరిన్ని బావులు తవ్వాలని కెయిర్న్ ఇండియా యోచిస్తోందని కంపెనీ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రబ్రున్ షా తెలిపారు. ఈ పెట్టుబడి ద్వారా వీలైనంత త్వరగా ఉత్పత్తిని 5 లక్షల టన్నులకు చేరుకోవడమే తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు.

లంకలో ఆయిల్ రేట్లు పెంచిన IOL..

మరో పక్క దేశీయ చమురు దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ తన పెట్రో రేట్లను పెంచింది. శ్రీలంకలోని తన అనుబంధ సంస్థ లంక ఇండియన్ ఆయిల్ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేవలం ఒక్కనెలలోనే రేట్లను మూడు సార్లు కంపెనీ అక్కడ పెంచింది. ప్రస్తుతం అక్కడ లీటరు డీజిల్‌పై రూ.75, పెట్రోల్‌పై రూ.50 చొప్పున రిటైల్‌ ధరను పెంచినట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో తాజాగా.. లీటర్ పెట్రోల్ ధర రూ.254కి, డీజిల్ ధర రూ.214కి చేరుకున్నాయి. దీనికి ప్రధాన కారణం శ్రీలంక రూపాయి మారక విలువ డాలర్ తో పోల్చితే భారీగా పతనం కావటమేనని తెలుస్తోంది.

ఇవీ చదవండి..

Industrial Productivity: 1.3 శాతం పెరిగిన ఇండస్ట్రియల్ ప్రొడక్షన్.. కొత్త ఉద్యోగాలకు అవకాశం..

PAN Alert: పాన్ కార్డ్ అలా వాడుతున్నారా? వెంటనే జాగ్రత్తపడకపోతే బుక్కైపోతారు..