Solar Power: గత ఏడేళ్లలో దేశ సౌర విద్యుత్ సామర్థ్యం 17 రెట్లు పెరిగి 45,000 మెగావాట్లకు చేరుకుందని ఐక్యరాజ్యసమితి సదస్సులో భారత్ వెల్లడించింది. భారతదేశం ప్రపంచ జనాభాలో 17 శాతం వాటాను కలిగి ఉందని, ఇంకా మొత్తం ఉద్గారాలలో తమ వాటా నాలుగు శాతమేనని వెల్లించింది. ఆదివారం గ్లాస్గోలో కాప్-26 శిఖరాగ్ర సదస్సులో పర్యావరణ మంత్రిత్వశాఖ సలహాదారుడు, సైంటిస్ట్ జె.ఆర్. భట్ ఒక ప్రకటన విడుదల చేశారు. 2005-14 మధ్య కాలంలో స్థూల దేశీయోత్పత్తి ఉద్గార తీవ్రతను 24 శాతం తగ్గించినట్లు నివేదికలో తెలిపారు. ఇది సోలార్ ప్రోగ్రామ్‌లో కూడా గణనీయమైన వృద్ధిని నమోదు చేసినట్లు చెప్పారు.
గ్లోబల్ ఉద్గారాలకు సహకారం 4 శాతం మాత్రమే:
ఈ సందర్భంగా జె.ఆర్. భట్ మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల కారణంగా వర్థమాన దేశాలకు ప్రమాదం పొంచివుందని చెబుతోందని, దీనిని అడ్డుకోవాలంటే అంతర్జాతీయ సహకారం పెరిగాలని అన్నారు. ప్రపంచ జనాభాలో భారతదేశం 17 శాతం ప్రాతినిధ్యం వహిస్తుందని, మొత్తం ఉద్గారాలు కేవలం నాలుగు శాతం మాత్రమేనని అన్నారు.
సౌరశక్తి సామర్థ్యం 45 వేల మెగావాట్లకు చేరింది:
భారతదేశం వాతావరణ మార్పులకు గురవుతోందని, గత ఏడేళ్లలో సౌరశక్తి సామర్థ్యం 17 రెట్లు పెరిగిందని, ఇది ఇప్పుడు 45,000 మెగావాట్లకు చేరిందన్నారు. కాగా, భారతదేశం పునరుత్పాదక ఇంధనం దిశగా వేగంగా దూసుకుపోతోందని ప్రధాన నరేంద్రమోడీ తెలిపిన విషయం తెలిసిందే. 2030 నాటికి భారతదేశం ఉత్పత్తి చేసే ఇంధనంలో సగానికిపైగా గ్రీన్ ఎనర్జీ ద్వారానే లభిస్తుందని అన్నారు. భారతదేశం మొదటగా 500గిగావాట్స్ నాన్ ఫాసిల్ ఇంధనమే లక్ష్యంగా పెట్టుకుందని, దీని రెండో లక్ష్యం 2030 నాటికి పునరుత్పాదక వనరులకు అవసరమైన సగం శక్తిని ఉత్పత్తి చేయడమేనని అన్నారు. భారత దేశం ప్రస్తుతం మొత్తం విద్యుత్ అవసరాలలో 70 శాతం బొగ్గుపై ఆధారపడి ఉందని, 2030 నాటికి 50 శాతం శిలాజ రహిత ఇంధనాలను పొందడం సవాలుగా ఉంది. 2070 నాటికి భారత నికర సున్నా ఉద్గారాల లక్ష్యాన్ని సాధిస్తుందని మోడీ అన్నారు.
ఇవి కూడా చదవండి: