AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Central Government: కేంద్రం అద్బుత పథకం.. పోస్టాఫీస్ ద్వారా నెలకు రూ.30 వేలు.. దరఖాస్తు చేస్కుంటే చాలు..

పోస్ట్ ఆఫీస్ ఫ్రాంచైజ్ 2026 ద్వారా ఇండియా పోస్ట్ సేవలను అందించి ఆదాయం పొందవచ్చు. దీనికి కనీస అర్హత 8వ తరగతి. రూ.5 వేలు సెక్యూరిటీ డిపాజిట్ చేస్తే సరిపోతుంది. మీరు అందించే సేవలపై కమిషన్ ఉంటుంది. అయితే స్థిరమైన జీతం ఉండదు.

Central Government: కేంద్రం అద్బుత పథకం.. పోస్టాఫీస్ ద్వారా నెలకు రూ.30 వేలు.. దరఖాస్తు చేస్కుంటే చాలు..
Money
Venkatrao Lella
|

Updated on: Sep 14, 2026 | 9:57 AM

Share

చదువు పూర్తయిన తర్వాత చాలామందికి ఉద్యోగం లేదా వ్యాపారం చేయాలనే ఆకాంక్ష ఉంటుంది. ప్రభుత్వ రంగంలో భాగస్వామ్యం కావాలనుకునేవారికి ఇండియా పోస్ట్ ఫ్రాంచైజ్ ఒక మంచి అవకాశంగా చెప్పుకొవచ్చు. కొన్ని ప్రదేశాలలో పోస్టల్ సేవలను అందించడానికి ఫ్రాంచైజ్ అవుట్‌లెట్ మోడల్‌ను ఇండియా పోస్ట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫ్రాంచైజ్ ద్వారా మీరు కొన్ని పోస్టల్ సేవలను కస్టమర్లకు అందించవచ్చు. ఇందులో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి. ఫ్రాంచైజ్ అవుట్‌లెట్ మరియు పోస్టల్ ఏజెంట్. పోస్టల్ ఏజెంట్లు ఎక్కువగా స్టాంపులు, స్టేషనరీ వస్తువులను విక్రయిస్తారు. ఇక ఫ్రాంచైజ్ అవుట్‌లెట్ విషయానికొస్తే.. ఇండియా పోస్ట్‌తో ఒక ఒప్పందం చేసుకుని ఆథరైజ్డ్ ఫ్రాంచైజ్ అవుట్‌లెట్‌ తెరవొచ్చు. దీని వల్ల మీరు ఆదాయం సంపాదించుకోవచ్చు. వ్యాపారం మొదలుపెట్టాలనుకునేవారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. మీరు డెలివరీ చేసే ప్రతీ పోస్ట్‌పై కమిషన్ అందుతుంది.

అర్హతలు ఇవే..

వయస్సు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయస్సు పరిమితి అనేది లేదు. దీంతో పెద్ద వయస్సువారు అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక కనీసం 8వ తరగతి పాస్ అయి ఉండాలి.  బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. పోస్టల్ ఉద్యోగుల కుటుంబసభ్యులకు దీనిని అనర్హులు. మీ ఫ్రాంచైజ్ అవుట్‌లెట్ కస్టమర్‌లకు సులభంగా అందుబాటులో ఉండాలి. మీకు అనుకూలమైన షాప్ లేదా కౌంటర్ స్పేస్ ఉండాలి. అది సొంత ప్రాపర్టీ అయినా లేదా అద్దెకు తీసుకున్న ప్రదేశం అయినా ఉండవచ్చు. మీరు ఏదైనా ప్రాంతంలో మొదలుపెట్టాలని అనుకుంటే.. ఆ ప్రాంతంలో పోస్టల్ సేవలకు డిమాండ్ ఉందా.. లేదా అనేది పరిశీలించుకోండి. కనీస సెక్యూరిటీ డిపాజిట్ రూ.5,000 చేయాలి. సెక్యూరిటీ డిపాజిట్‌తో పాటు ఒక షాప్/కౌంటర్ స్పేస్, కంప్యూటర్, ల్యాప్‌టాప్, ప్రింటర్, ఇంటర్నెట్ కనెక్షన్, బేసిక్ ఫర్నీచర్, సైనేజ్ వంటి మౌలిక సదుపాయాలకు కూడా ఖర్చు అవుతుంది. ఈ ఫ్రాంచైజ్‌లో ఫిక్స్‌డ్ నెలవారీ జీతం ఉండదు.మీరు కస్టమర్లకు అందించే పోస్టల్ సేవలకు వర్తించే కమిషన్ లేదా రెమ్యూనరేషన్ లభిస్తుంది. ఎక్కువ ట్రాన్సాక్షన్లు జరిగితే ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. పెద్ద మొత్తంలో సేవలు అందిస్తే.. నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. మీ ఆదాయం లొకేషన్, కస్టమర్ ట్రాఫిక్, ట్రాన్సాక్షన్లు, మీరు అందించే సేవలపై ఆధారపడి ఉంటుంది.

దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

రిజిస్టర్డ్ ఆర్టికల్స్, రిజిస్టర్డ్ పార్సెల్స్ బుకింగ్,  స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్, స్పీడ్ పోస్ట్ పార్సెల్స్ బుకింగ్, మనీ ఆర్డర్ బుకింగ్, పోస్టల్ స్టాంపులు, ఎన్వలప్‌లు, ఇతర స్టేషనరీ వస్తువుల విక్రయం ద్వారా ఆదాయం పొందవచ్చు.  అర్హత ఉంటే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (PLI) ఏజెంట్ సేవలు కూడా అందించవచ్చు. డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన కొన్ని బిల్లు, పన్ను, జరిమానా వసూలు సేవలు వంటి సేవలు కూడా అందించవచ్చు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, విద్యార్హత సర్టిఫికెట్లు, చిరునామా వివరాలు, ప్రెమిసెస్ లేదా షాప్ డాక్యుమెంట్లు వంటి డాక్యుమెేంట్లు దరఖాస్తు చేసుకోవడానికి అవసరం. అప్లికేషన్‌లో బిజినెస్ లొకేషన్, కంప్యూటర్ నాలెడ్జ్, మునుపటి అనుభవం వంటి వివరాలు అడుగుతారు.  ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్‌లో ఫ్రాంచైజ్ స్కీమ్ వివరాలను తనిఖీ చేయండి. అధికారిక అప్లికేషన్ ఫామ్ తీసుకోండి. మీ పేరు, చిరునామా, వయస్సు, విద్య, పాన్ వివరాలు, వ్యాపార స్థలం, ప్రెమిసెస్ వివరాలు వంటివి ఖచ్చితంగా నింపండి. అవసరమైన డాక్యుమెంట్లను అప్లికేషన్‌కు జతపరచండి. సీనియర్ సూపరింటెండెంట్ లేదా సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ కార్యాలయంలో దరఖాస్తును సమర్పించండి

Follow Us