Sugar: భారీగా పెరిగిన చక్కెర ఎగుమతి.. ఇప్పటికే 58.10 లక్షల టన్నుల తరలింపు..

2021-22 మార్కెటింగ్ సంవత్సరంలో చక్కెర మిల్లులు 58.10 లక్షల టన్నుల చక్కెర(sugar)ను ఎగుమతి చేసినట్లు ఆల్ ఇండియా షుగర్ ట్రేడ్ అసోసియేషన్ ( AISTA ) గురువారం ఒక ప్రకటనలో తెలిపారు...

Sugar: భారీగా పెరిగిన చక్కెర ఎగుమతి.. ఇప్పటికే 58.10 లక్షల టన్నుల తరలింపు..
Sugar
Follow us

|

Updated on: Apr 08, 2022 | 9:28 AM

2021-22 మార్కెటింగ్ సంవత్సరంలో చక్కెర మిల్లులు 58.10 లక్షల టన్నుల చక్కెర(sugar)ను ఎగుమతి చేసినట్లు ఆల్ ఇండియా షుగర్ ట్రేడ్ అసోసియేషన్ ( AISTA ) గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2021-22 మార్కెటింగ్ సంవత్సరంలో ప్రభుత్వ సబ్సిడీ లేకుండా 74 లక్షల టన్నుల చక్కెరను ఎగుమతి చేసేందుకు మిల్లులు ఇప్పటి వరకు ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలిపారు. చైనీస్ మార్కెటింగ్(Chinies Marketing) సంవత్సరం అక్టోబర్ నుంచి సెప్టెంబర్ వరకు నడుస్తుంది. ఈ ఏడాది ప్రభుత్వం సబ్సిడీ లేకుండా చక్కెరను ఎగుమతి చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చక్కెర ధరలు మెరుగ్గా ఉన్నందున, దేశంలోని చక్కెర రంగ వృద్ధికి అవకాశాలు ఎక్కువున్నాయి.

చక్కెర మిల్లులు అక్టోబర్ 2021 నుంచి ఈ సంవత్సరం ఏప్రిల్ 7 వరకు మొత్తం 58.10 లక్షల టన్నుల చక్కెరను ఎగుమతి చేశాయి. ఇందులో 49.60 లక్షల టన్నులు చక్కెర మిల్లులు, వ్యాపారుల ఎగుమతిదారులు నేరుగా ఎగుమతి చేయగా, 8.50 లక్షల టన్నులు భారతీయ రిఫైనరీలకు రిఫైనింగ్, ఓవర్సీస్ సరఫరా కోసం అందిచారు. ఎగుమతి ప్రయోజనాల కోసం చక్కెరను రవాణా చేయడానికి రైలు వ్యాగన్ల కొరతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. AISTA అధ్యక్షుడు గోధుమల తరలింపునకు రైల్వే ప్రాధాన్యత ఇస్తోందన్నారు. దీని వల్ల చక్కెర ఎగుమతులకు రైల్ వ్యాగన్ల లభ్యతపై ప్రభావం చూపుతుందని తెలిపారు. ఎగుమతిదారులకు వ్యాగన్లను ఏర్పాటు చేయడం కష్టమవుతోందని, భారత చక్కెర కర్మాగారాలకు పౌండ్‌కు 19 సెంట్లు లభిస్తుందని ప్రఫుల్ల విఠలాని అన్నారు.

అదనపు చక్కెర నిల్వలను సేకరించి రైతులకు చెరకు ధర చెల్లించాలి. 2022-23 మార్కెటింగ్ సంవత్సరానికి 6 మిలియన్ టన్నుల ఓపెనింగ్ స్టాక్ ఉంచిన తర్వాత ప్రభుత్వం గరిష్ఠంగా చక్కెరను ఎగుమతి చేయడానికి అనుమతించాలని విఠలాని కోరారు. 2020-21 మార్కెటింగ్ సంవత్సరంలో, దేశం రికార్డు స్థాయిలో 72.3 లక్షల టన్నుల చక్కెరను ఎగుమతి చేసింది. చక్కెర ఎగుమతులు చాలా వరకు ప్రభుత్వ రాయితీల సహాయంతో జరిగాయి. 2021-22 సెషన్‌లో (అక్టోబర్-సెప్టెంబర్) చక్కెర ఎగుమతులు 7.5 మిలియన్ టన్నులుగా ఉంటాయని ప్రభుత్వం అంచనా వేసింది.

Read Also.. Book Now Pay Later: ఇప్పుడే బుక్‌ చేయండి.. డబ్బులు తర్వాత చెల్లించండి.. పేటీఎం సరికొత్త సేవలు