Industrial Productivity: ప్రతికూల పరిస్థితుల్లోనూ దేశ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిని నమోదు చేసింది. గతంలో కరోనాకు ముందు(Pre-covid) ఇదే నెల రికార్డు చేసిన దానికంటే మంచి వృద్ధిని సాధించింది. కరోనా మూడో వేవ్(Third Wave) వచ్చినప్పటికీ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పాజిటివ్ గా ఉండడాన్ని మంచి సూచీగా నిపుణులు చెబుతున్నారు. డిసెంబర్‌లో 10 నెలల కనిష్ఠానికి పడిపోయిన తర్వాత.. జనవరి ఐఐపి గణాంకాలలో స్వల్ప మెరుగుదలను కనబరిచింది. జనవరిలో ఐఐపీ 1.3 శాతానికి పెరిగింది. డిసెంబర్‌లో ఈ సంఖ్య కేవలం 0.7 శాతంగా ఉంది.
దేశంలోని 8 ప్రధాన రంగాల్లో వృద్ధి 3.7 శాతం కాగా.. గత నెలలో 4.1 శాతం వృద్ధిని సాధించింది. ఐఐపీలో కోర్ సెక్టార్ వాటా 40.3 శాతంగా ఉంది. మరోవైపు, తయారీ రంగం గత నెలలో 0.9% క్షీణతతో పోల్చితే 1.1 శాతం వృద్ధిని సాధించింది. ఏప్రిల్ 2020లో కరోనా సమయంలో IIP 57.3 శాతానికి పడిపోయినప్పుడు.. IIP గణాంకాలలో అతిపెద్ద తగ్గుదలను కనబరిచింది. ప్రధానంగా మైనింగ్ 2.8 శాతం, ఎలక్ట్రిసిటీ 0.9 శాతం వృద్ధిని నమోదు చేశాయి. దీని కారణంగా రానున్న కాలంలో కొత్తగా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరి ఫిబ్రవరి పరిస్థితి ఏమిటి..
డిమాండ్, సప్లైలలో వీక్ నెస్ కారణంగా పరిశ్రమ వేగంగా కోలుకోలేక పోతోందని నిపుణులు అంటున్నారు. దీని కారణంగా రానున్న ఫిబ్రవరిలోనూ పారిశ్రామిక వృద్ధి నెమ్మదిగానే ఉండనుందని తెలుస్తోంది. ఇది కేవలం సింగిల్ డిజిట్ కు పరిమితం కానుంది. క్రూడ్ ఆయిల్ తో పాటు ఇతర కమోడిటీ ధరలు పెరిగిన కారణంగా డిమాండ్ మరింతగా పడిపోవచ్చని.. దానివల్ల రానున్న కాలంలో ప్రైవేటు పెట్టుబడులు ఊహించిన స్థాయిలో రాకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) విడుదల చేసిన డేటా ప్రకారం.. ఫిబ్రవరిలో ప్రయాణ వాహనాల అమ్మకాలు అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 6.5% మేర తగ్గాయి.
ఇవీ చదవండి..
PAN Alert: పాన్ కార్డ్ అలా వాడుతున్నారా? వెంటనే జాగ్రత్తపడకపోతే బుక్కైపోతారు..
డాటా ప్రొటెక్షన్ బిల్లుకు నెట్ న్యూట్రాలిటీ తలనొప్పి.. పూర్తి వివరాలు..