మీరు ఇండెన్ గ్యాస్ వినియోగదారులా.? తరచూ ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ వస్తుందా.? అయితే ఈ విషయం మీకోసమే.! వాస్తవానికి, ఇండియన్ ఆయిల్.. ఇండెన్ గ్యాస్ వినియోగదారులకు అనేక సేవలను అందిస్తోంది. అంతేకాకుండా గ్యాస్ సిలిండర్లు వినియోగదారుల ఇళ్లకు చేరేలా జాగ్రత్తలు కూడా తీసుకుంటోంది. ఇందుకోసం ఇండియన్ ఆయిల్ ప్రత్యేక కోడింగ్ సిస్టంను ఏర్పాటు చేసింది. అదే డీఏసీ(DAC) కోడ్. దీని ద్వారా మీరు ఇంటికి గ్యాస్ సిలిండర్‌ను ఆర్డర్ చేసుకోవచ్చు. అసలు DAC కోడ్ అంటే ఏమిటి.? సిలిండర్ డెలివరీలో దాని పాత్ర ఏమిటి.? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
DAC అనేది ఒక రకమైన కోడ్, దీని పూర్తి పేరు డెలివరీ ప్రామాణీకరణ కోడ్. ఇండెన్ గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసిన సమయంలో.. ఈ కోడ్ SMS ద్వారా మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వస్తుంది. ఇది ఒక విధంగా OTPగా పని చేస్తుంది. ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసేందుకు వచ్చిన వ్యక్తికి మీరు ఈ DAC చెప్తే, అతడు మీకు సిలిండర్ అప్పగిస్తాడు. దీనితో, గ్యాస్ సిలిండర్ హోం డెలివరీ ప్రక్రియ ముగుస్తుంది. DAC కస్టమర్ ఫోన్‌కు వచ్చే నాలుగు అంకెల కోడ్.
Also Read:
Viral Video: అయ్యో.! పాపం కోతి.. లెక్క తప్పింది.. బోర్లా పడింది.. వైరల్ అవుతున్న వీడియో..
Viral Video: ఈ జంతువు ఏంటో చెప్పగలరా.? భలేగా డ్యాన్స్ చేస్తోంది కదా.! వైరల్ వీడియో..
Jio Offers: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. అతి చవకైన ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. బెనిఫిట్స్ ఇవే..
Did you know that a unique DAC is generated every time you book your #Indane refill? Share the DAC with the delivery personnel to complete the delivery process. Help us serve you better. #Indane #DAC #LPG pic.twitter.com/jmmeNNpqwV
— Indian Oil Corp Ltd (@IndianOilcl) June 2, 2021