FD Interest Rates: బ్యాంకుల్లో పెరుగుతున్న ఫిక్స్డ్ డిపాజిట్లు.. ఈ బ్యాంకులు ఇచ్చే వడ్డీ ఎంతో తెలుసా?

|

May 01, 2023 | 4:45 PM

ఏప్రిల్‌లో నిర్వహించిన ఎంపీసీ సమావేశంలో సెంట్రల్ బ్యాంక్ రెపో రేటుపై విరామం ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో గత 11 నెలలుగా పెరుగుతున్న రేట్ల నుంచి రుణ గ్రహీతలకు కొంత ఉపశమనం కలిగించింది. గతేడాది నుంచి రెపో రేటు 250 బేసిస్ పాయింట్లు పెరిగాయి.

FD Interest Rates: బ్యాంకుల్లో పెరుగుతున్న ఫిక్స్డ్ డిపాజిట్లు.. ఈ బ్యాంకులు ఇచ్చే వడ్డీ ఎంతో తెలుసా?
Fixed Deposits Rates
Follow us on

ప్రముఖ బ్యాంకులన్నీ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను మే 2022 నుంచి పెంచుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా ఐదు సార్లు రెపో రేటు పెంపుదల చేయడంతో ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు మరింత ఊపందుకున్నాయి. అయితే ఏప్రిల్‌లో నిర్వహించిన ఎంపీసీ సమావేశంలో సెంట్రల్ బ్యాంక్ రెపో రేటుపై విరామం ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో గత 11 నెలలుగా పెరుగుతున్న రేట్ల నుంచి రుణ గ్రహీతలకు కొంత ఉపశమనం కలిగించింది. గతేడాది నుంచి రెపో రేటు 250 బేసిస్ పాయింట్లు పెరిగాయి. ఫిబ్రవరి 2023లో చివరిసారిగా 25 బీపీఎస్‌ల పెంపుతో రెపో రేటు ప్రస్తుతం 6.5 శాతానికి చేరింది. ప్రస్తుతం ఏయే బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక శాతం వడ్డీ రేట్లను ఇస్తున్నాయో? ఓ సారి తెలుసుకుందాం.

ఐసీఐసీఐ బ్యాంక్

ఈ బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్‌లపై 3 శాతం నుంచి 7.10 శాతం వరకూ వడ్డీ వస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్‌లకు అదనపు వడ్డీ రేటు అందిస్తుంది. ఎఫ్‌డీల కాలవ్యవధి 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ వడ్డీ రేట్లు ఫిబ్రవరి 24 నుంచి అందుబాటలో ఉన్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

ఈ బ్యాంకులో మీ డబ్బును 7 రోజుల నుంచి 10 సంవత్సరాల మధ్య కాల వ్యవధిలో పెట్టుబడి పెట్టవచ్చు. డిపాజిట్ చేసిన మొత్తంపై వడ్డీని పొందవచ్చు. మీరు 3 శాతం నుంచి 7.1 శాతం వరకు వడ్డీ రేటును పొందవచ్చు. సీనియర్ సిటిజన్‌లు 7 రోజుల నుంచి 5 సంవత్సరాల వరకు  3.5% నుంచి 7.6% వరకు అంటే సాధారణ ప్రజలకు ఇచ్చే వడ్డీ రేటు కంటే 0.5 శాతం అదనపు వడ్డీ రేటును పొందుతారు. ఈ రేట్లు ఫిబ్రవరి 21 నుంచి అమల్లో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

యాక్సిస్ బ్యాంక్

యాక్సిస్ బ్యాంక్ సాధారణ ప్రజలకు 3.50 శాతం నుంచి 7.20 శాతం వరకూ ఎఫ్‌డీలపై వడ్డీని అందిస్తుంది. అయితే సీనియర్ సిటిజన్‌లకు 3.50 శాతం నుంచి 7.95 శాతం వరకూ వడ్డీ ఇస్తుంది. ఈ రేట్లను 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు అందిస్తుంది. ఈ రేట్లు ఏప్రిల్ 21 నుంచి అమలులోకి వచ్చాయి.

ఎస్‌బీఐ

ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు అనేక ఆకర్షణీయమైన ప్రయోజనాలతో కూడిన అద్భుతమైన వడ్డీ రేట్లను అందిస్తుంది. సాధారణ ప్రజల కోసం 3.00 శాతం నుంచి 7.10 శాతం వరకూ వడ్డీ వస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం నుంచి 7.60 శాతం వరకు వడ్డీ అందిస్తుంది. పెంచిన రేట్లు ఫిబ్రవరి 15 నుంచి అమలులోకి వచ్చాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..