Health Insurance: ఆరోగ్య బీమాలో ప్రసూతి ప్రయోజనాలకు పెరుగుతున్న డిమాండ్‌..పాలసీ తీసుకునే ముందు ఆ జాగ్రత్తలు మస్ట్‌

ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో అనారోగ్య సమయంలో వైద్య ఖర్చులు షాక్‌కు గురి చేస్తున్నాయి. ఏళ్లుగా పొదుపు చేసుకున్న సొమ్ము ఒక్క దెబ్బకు పోతున్నాయి. ప్రతి కుటుంబ సంపాదనలో దాదాపు 14 శాతం వైద్య అవసరాల ఖర్చుల రూపంలో ఉంటుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైద్య ఖర్చులను తగ్గించేందుకు ఆరోగ్య బీమా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే చాలా వరకు ఆరోగ్య బీమా పాలసీలు మెటర్నిటీ ఖర్చులను అందచవు. ముఖ్యంగా వెయిటింగ్ పిరియడ్ కారణంగా చాలా వరకు మెటర్నిటీ క్లెయిమ్‌లు ఆరోగ్య బీమా సంస్థలు ఆమోదించవు.

Health Insurance: ఆరోగ్య బీమాలో ప్రసూతి ప్రయోజనాలకు పెరుగుతున్న డిమాండ్‌..పాలసీ తీసుకునే ముందు ఆ జాగ్రత్తలు మస్ట్‌
Maternity Health Insurance

Updated on: Sep 22, 2024 | 4:15 PM

ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో అనారోగ్య సమయంలో వైద్య ఖర్చులు షాక్‌కు గురి చేస్తున్నాయి. ఏళ్లుగా పొదుపు చేసుకున్న సొమ్ము ఒక్క దెబ్బకు పోతున్నాయి. ప్రతి కుటుంబ సంపాదనలో దాదాపు 14 శాతం వైద్య అవసరాల ఖర్చుల రూపంలో ఉంటుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైద్య ఖర్చులను తగ్గించేందుకు ఆరోగ్య బీమా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే చాలా వరకు ఆరోగ్య బీమా పాలసీలు మెటర్నిటీ ఖర్చులను అందచవు. ముఖ్యంగా వెయిటింగ్ పిరియడ్ కారణంగా చాలా వరకు మెటర్నిటీ క్లెయిమ్‌లు ఆరోగ్య బీమా సంస్థలు ఆమోదించవు. కానీ పెరుగుతున్న ఆరోగ్య ఖర్చుల నేపథ్యంలో మెటర్నిటీ బెనిఫిట్స్ ఉన్న ఆరోగ్య బీమా పాలసీలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మెటర్నిటీ బెనిఫిట్స్ ఇచ్చే ఆరోగ్య బీమా తీసుకునే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఓసారి తెలుసుకుందాం. 

పదేళ్ల క్రితం వరకు ఆరోగ్య బీమా పాలసీల్లో ప్రసూతి కవరేజీ తరచుగా పరిమిత ప్రయోజనంగా భావించే వారు. ఆరోగ్య బీమా పాలసీ కేవలం బిడ్డ పుట్టే వరకు అయ్యే ఖర్చులను మాత్రమే కవర్ చేస్తుంది. మెటర్నిటీ కవరేజీని అందించే సాంప్రదాయ ఉత్పత్తులు కనీసం 1-2 సంవత్సరాల నిరీక్షణ వ్యవధిని కలిగి ఉంటాయి. ఈ నేపథ్యంలో పిల్లల కోసం ట్రై చేసే కొత్త జంటలకు ఈ పాలసీలు ఏ మాత్రం ప్రయోజనం చేకూర్చవు. సాధారణంగా ప్రసూతి కవరేజీకి డిమాండ్ 25-35 ఏళ్ల మధ్య ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మెటర్నిటీ ఇన్సూరెన్స్‌లోని కొత్త ఫీచర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాలసీ క్లెయిమ్‌లను సెటిల్ చేయవచ్చు. కొన్ని ప్రత్యేక ప్లాన్స్ ద్వారా వెయిటింగ్ పీరియడ్ వ్యవధిని కొన్ని బీమా కంపెనీలు 3 నెలల కంటే తక్కువగా అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇలాంటి పాలసీలు నూతన జంటలకు ప్రసూతి ప్రయోజనాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే కొన్ని పాలసీలు 9 నెలల వెయిటింగ్ పీరియడ్‌తో వచ్చే ఇతర ప్లాన్‌లు ఉంటున్నాయి.

గతంలో ప్రసూతి కవరేజీ కోసం ఓ నూతన జంట 2-4 సంవత్సరాలను పాలసీలను కడుతూ నిరీక్షించాల్సి వచ్చేది. అయితే మారతున్న ఆలోచనల ప్రకారం ప్రస్తుత ప్రసూతి ప్లాన్‌లు 3 నుండి 9 నెలల పరిధిలో నిరీక్షణ వ్యవధితో అందుబాటులో ఉంటున్నాయి. ఇలాంటి ప్లాన్‌లు కొనుగోలు చేయడం చాలా ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. ఏ రకమైన డెలివరీ అంటే సాధారణ లేదా సిజేరియన్ కోసం ఉపయోగపడేలా సమగ్ర కవరేజ్, సరసమైన ధరతో ఈ పాలసీలు అందుబాటులో ఉంటున్నాయి. పాలసీదారులు క్లెయిమ్‌ను ఫైల్ చేయకుంటే కవర్ చేసిన ప్రసూతి మొత్తాన్ని మరుసటి సంవత్సరానికి ఫార్వార్డ్ చేసే ఫీచర్‌ను అందించే పాలసీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్‌ల కింద ఐవీఎఫ్ వంటి చికిత్సలకు కవరేజ్ కూడా అందుబాటులో ఉంది. పిల్లలను దత్తత తీసుకోవాలనుకునే వారికి ఈ ప్లాన్‌లు మొత్తం చట్టపరమైన దత్తత ప్రక్రియను కవర్ చేయడంతో పాటు ఆర్థిక రక్షణకు భరోసా ఇస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి