Gift By Family members: వారసత్వ లేదా బహుమతిగా వచ్చిన ఆస్తిపై పన్ను కట్టాలా? నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..!

|

Feb 07, 2023 | 4:25 PM

బంగారాన్ని బహుమతిగా తీసుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయాలపై ఆర్థిక శాఖ నిపుణులు ఏం చెబుతున్నారో? అలాగే వారసత్వంగా వచ్చిన ఆస్తి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ప్రశ్నలు జవాబుల రూపంలో ఓ సారి తెలుసుకుందాం.

Gift By Family members: వారసత్వ లేదా బహుమతిగా వచ్చిన ఆస్తిపై పన్ను కట్టాలా? నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..!
Income Tax
Follow us on

భారతదేశంలో బంగారాన్ని కేవలం పెట్టుబడిగా మాత్రమే కాకుండా ఆభరణాలుగా వాడుతుంటారు. అందుకే ఇండియాలో బంగారం వాడకం అధికంగా ఉంటుంది. దీంతో భారతదేశం అధికం మొత్తంలో బంగారాన్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అయితే చాలా మంది తమ బంగారు ఆభరణాలను తమ వారసులకు బహుమతిగా ఇస్తుంటారు. అలా బంగారాన్ని తీసుకోవచ్చా? ఒక వేళ ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేసినప్పుడు ఆ బంగారానికి బిల్లులు చూపించలేనప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారు. బంగారాన్ని బహుమతిగా తీసుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయాలపై ఆర్థిక శాఖ నిపుణులు ఏం చెబుతున్నారో? అలాగే వారసత్వంగా వచ్చిన ఆస్తి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ప్రశ్నలు జవాబుల రూపంలో ఓ సారి తెలుసుకుందాం.

ప్రశ్న : భార్య తన అత్తింటి తరఫు నుంచి వచ్చిన బంగారాన్ని తల్లికి బహుమతిగా ఇవ్వొచ్చా?

జవాబు : ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం కొంత మేర బంగారాన్ని ఇస్తే పన్ను కట్టాల్సిన అవసరం లేదు. అయితే భార్య తల్లి బంగారాన్ని విక్రయిస్తే మాత్రం పన్ను చెల్లించాలని గుర్తుంచుకోవాలి.

ఇవి కూడా చదవండి

ప్రశ్న : తండ్రి మరణానంతరం వచ్చిన వారసత్వ ప్లాట్ ను అమ్మితే? 

జవాబు : సాధారణంగా వారసత్వంగా వచ్చిన ఆస్తిపై ఆదాయపు పన్ను శాఖ ఎలాంటి పన్ను వసూలు చేయదు. అయితే గ్రహీత ఎక్కువ  రోజులు ప్లాట్ ను తన వద్ద ఉంచుకుని అనంతరం అమ్మితే మాత్రం మూలధన లాభాల కింద వర్గీకరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 

ప్రశ్న : వారసత్వంగా వచ్చిన ఆస్తిని విక్రయిస్తే పన్ను చెల్లించాలా?

జవాబు : దీర్ఘకాలిక, మూలధన ఆస్తులుగా ఉంచిన స్థిరాస్థి బదిలీపై వచ్చే లాభాలపై 20 శాతం పన్ను విధిస్తారు. ముఖ్యంగా వారసత్వం ద్వారా వచ్చిన ఆస్తిని సంపాదించింది తండ్రి కాబట్టి సముపార్జన ఖర్చును తండ్రి సంపాదించిన ధరగా పరిగణిస్తారు. అలాగే మూల ధన లాభాలాను నివాస గృహంపై పెట్టుబడి పెడితే అవి మీ ఆదాయం నుంచి మినిహాయిస్తారు. అయితే ఇలా పెట్టుబడి పెట్టడానికి ఉండే సమయం మూడు సంవత్సరాలు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..