Income Tax Notice: విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు..!

|

Sep 28, 2024 | 9:12 PM

దేశంలో ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసేవారిలో కొద్ది శాతం మంది మాత్రమే ఉన్నారు. ఆదాయపు పన్ను శాఖ రిటర్న్‌తో దాఖలు చేసిన పత్రాలను తనిఖీ చేస్తుంది. ఆదాయపు పన్ను పరిమితి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులను కూడా శోధిస్తారు. బిహార్‌లో ఆదాయపు పన్ను శాఖ భిన్నమైన కథనం వెలుగులోకి..

Income Tax Notice: విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు..!
Follow us on

దేశంలో ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసేవారిలో కొద్ది శాతం మంది మాత్రమే ఉన్నారు. ఆదాయపు పన్ను శాఖ రిటర్న్‌తో దాఖలు చేసిన పత్రాలను తనిఖీ చేస్తుంది. ఆదాయపు పన్ను పరిమితి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులను కూడా శోధిస్తారు. బిహార్‌లో ఆదాయపు పన్ను శాఖ భిన్నమైన కథనం వెలుగులోకి వచ్చింది. ఆదాయపు పన్ను శాఖ ఒక వ్యక్తికి రూ. 2 కోట్ల 3 వేల 308 పన్ను చెల్లించాలని ఈ నోటీసు. ఆయిల్ వ్యాపారి వద్ద పనిచేస్తున్న రాజీవ్ కుమార్ వర్మకు ఈ నోటీసులు అందాయి. ఈ కేసు బీహార్‌లోని గయా జిల్లాకు చెందినది. అయితే నెలకు పది వేల రూపాయల జీతం తీసుకునే వ్యక్తికి ఇలాంటి నోటీసులు రావడం సంచలనంగా మారింది.

నోటీసులో ఏముంది?

రూ.2 కోట్ల 3 వేల 308 పన్ను చెల్లించాలని రాజీవ్ కుమార్ వర్మకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపింది. ఈ నోటీసు ప్రకారం వారికి రూ.67 లక్షల జరిమానా కూడా విధించారు. ఈ మొత్తం రెండు రోజుల్లో చెల్లించాలన్నారు. ఆదాయపు పన్ను శాఖ నుంచి ఈ నోటీసు అందిన తర్వాత రాజీవ్ చాలా భయపడ్డాడు. గత నాలుగు రోజులుగా అతను పనికి కూడా వెళ్లలేదు. చివరకు గయాలోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయానికి వెళ్లారు.

ఇవి కూడా చదవండి

అసలు కేసు ఏమిటి?

2015లో రాజీవ్ కార్పొరేషన్ బ్యాంకులో రూ.2 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి) చేశారు. 2016లో తనకు డబ్బు అవసరం కావడంతో ఫిక్స్‌డ్ డిపాజిట్ ను బ్రేక్ చేశాడు. అయితే అకస్మాత్తుగా ఆదాయపు పన్ను శాఖ ఆయనకు ఆ కేసులో 2 కోట్ల 3 వేల 308 రూపాయల ఆదాయపు పన్ను నోటీసు పంపింది. రాజీవ్ 2015-16లో రూ.2 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ ఆరోపించింది.

ఈ రాజీవ్ ఉదంతం కారణంగా ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం మరోసారి తెరపైకి వచ్చింది. ఆదాయపు పన్ను శ్లాబ్‌లో పడని ఓ పేద వ్యక్తికి 2 కోట్లకు పైగా పన్ను నోటీసు పంపారు. మ‌రి ఈ విష‌యంలో చ‌ర్య‌లు ఏం తీసుకుంటారో చూడాలి.

ఇది కూడా చదవండి: Edible Oil Prices: పండగకు ముందు సామాన్యులకు షాక్‌.. భారీగా పెరిగిన వంట నూనె ధరలు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి