IT Department: మీరు క్రిప్టో ట్రేడింగ్ చేస్తున్నారా.. మీకు ఆదాయపన్ను శాఖ నుంచి నోటీలుసు వచ్చే ప్రమాదం ఉంది జాగ్రత్త..!

|

Mar 25, 2022 | 6:57 AM

IT Department: క్రిప్టో, ఎన్‌ఎఫ్‌టీ లాంటి వర్చువల్‌ డిజిటల్‌ అసెట్స్‌లో(Virtual Digital Assets) వచ్చే లాభాలను ఐటీ రిటర్నుల్లో వెల్లడించకపోతే ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే..

IT Department: మీరు క్రిప్టో ట్రేడింగ్ చేస్తున్నారా.. మీకు ఆదాయపన్ను శాఖ నుంచి నోటీలుసు వచ్చే ప్రమాదం ఉంది జాగ్రత్త..!
Follow us on

IT Department: క్రిప్టో, ఎన్‌ఎఫ్‌టీ లాంటి వర్చువల్‌ డిజిటల్‌ అసెట్స్‌లో(Virtual Digital Assets) వచ్చే లాభాలను ఐటీ రిటర్నుల్లో వెల్లడించకపోతే ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే వర్చువల్‌ డిజిటల్‌ అసెట్స్‌ లావాదేవీలను 30 శాతం పన్ను పరిధిలోకి తీసుకొస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తన తాజా బడ్జెట్‌(Latest Budget)లో వెల్లడించింది. 2022 ఏప్రిల్‌ 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు ఈ లావాదేవీలకు సంబంధించి పన్ను చెల్లింపుదారులే స్వయంగా తమ రిటర్నుల్లో వెల్లడించేవారు. స్వయంగా కోరి తీసుకుంటే తప్ప ఆదాయపన్ను శాఖకు ఆ లావాదేవీల వివరాలు ఇప్పటి వరకు తెలిసేవి కావు.

స్టాక్స్, మ్యూచువల్‌ ఫండ్స్‌ లావాదేవీల మాదిరిగానే వర్చువల్‌ డిజిటల్‌ అసెట్స్‌ లావాదేవీల వివరాలు కూడా.. ఇకపై ఆటోమేటిగ్గా ఆదాయపన్ను శాఖకు వెళ్లనున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం అన్ని బ్యాంకులు, క్రిప్టో ఎక్సేంజ్‌లను వర్చువల్‌ డిజిటల్‌ అసెట్స్‌ లావాదేవీల వివరాలను నివేదించాలని కోరనున్నట్టు తెలుస్తోంది. బ్యాంకులు, క్రిప్టో ఎక్సేంజ్‌లకు ఈ ఆదేశాలు వెళితే.. ఆ తరువాత క్రిప్టోలు, ఎన్‌ఎఫ్‌టీ లావాదేవీల వివరాలు ఇన్వెస్టర్ల పాన్‌ నంబర్‌ ఆధారంగా ఆదాయపన్ను శాఖకు చేరతాయి. అవి వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్‌)లో ప్రతిఫలిస్తాయి. ఏఐఎస్‌ అన్నది 46 ఆర్థిక లావాదేవీల వివరాలతో కూడిన రిపోర్ట్‌. ప్రతీ పన్ను చెల్లింపుదారు ఆదాయపన్ను శాఖ పోర్టల్‌కు వెళ్లి దీన్ని పొందొచ్చు. రిటర్నులు దాఖలు చేయడానికి ముందు ఏఐఎస్‌ను ధ్రువీకరించాల్సి ఉంటుంది. పన్ను ఎగవేత దారులను గుర్తించేందుకు ఐటీ శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

క్రిప్టోకరెన్సీలపై పన్ను నిబంధనలను కఠినతరం చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి సంబంధించి ఫైనాన్స్‌ బిల్లుకు సవరణలు తీసుకురావాలని నిర్ణయించింది. లోక్‌సభ సభ్యులకు ఈ మేరకు ఫైనాన్స్‌ బిల్లు, 2022కి సవరణ బిల్లు సర్క్యులేట్‌ అయ్యింది. వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తుల నష్టాలపై పన్ను ప్రయోజనాలు పొందడాన్ని సవరణలు నిరోధిస్తున్నాయి.

ఇవీ చదవండి..

Airtel Offer: ఎయిర్ టెల్ వినియోగదారులకు బంపర్ ఆఫర్.. ఆ యూజర్లకు ఫ్రీ ఓటీటీ..

GIG Workers: గిగ్ వర్కర్లు అంటే ఎవరో తెలుసా.. వారు ఆదాయపు పన్ను కట్టాలా..