Income Tax Benefits: ఈవీ వెహికల్ కొంటే ఆదాయ పన్ను రాయితీ.. ఎంత మినహాయింపువస్తుందో తెలుసా?

అధిక ఆదాయ పన్ను నుంచి తప్పించుకోడానికి మీ ఇంట్లో అవసరమయ్యే ఓ వస్తువు కొంటే ఆదాయ పన్ను మినహాయింపును పొందవచ్చు. పాత పన్ను విధానంలో ఉన్న వారికి పన్ను నుంచి మినాహాయింపు పొందడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి.

Income Tax Benefits: ఈవీ వెహికల్ కొంటే ఆదాయ పన్ను రాయితీ.. ఎంత మినహాయింపువస్తుందో తెలుసా?
Income Tax

Updated on: Feb 21, 2023 | 10:35 AM

ఆర్థిక సంవత్సరం ముగింపు ముంచుకొస్తుంది. చాలా మంది ఆదాయ పన్ను నుంచి మినాహాయింపులను పొందడానికి వివిధ మార్గాల గురించి వెతుకుతూ ఉంటారు. అయితే అధిక ఆదాయ పన్ను నుంచి తప్పించుకోడానికి మీ ఇంట్లో అవసరమయ్యే ఓ వస్తువు కొంటే ఆదాయ పన్ను మినహాయింపును పొందవచ్చు. పాత పన్ను విధానంలో ఉన్న వారికి పన్ను నుంచి మినాహాయింపు పొందడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి. సెక్షన్ 80-సి కింద లైఫ్ ఇన్సూరెన్స్ రూ.1.5 లక్షలు, పీపీఎఫ్ రూ.1.5 లక్షలు, సెక్షన్ 10 సీ కింద ఎన్‌పీఎస్ రూ.1.5 లక్షలు, అలాగే 80 సీసీ కింద సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆదాయ పన్ను నుంచి మినాహాయింపు లభిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు ఊరటనిస్తూ ఆదాయ పన్ను పరిమితి శ్లాబ్‌లను మార్చింది. రూ. 7 లక్షల ఆదాయం ఉన్న వారు కూడా ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే ఈ మినహాయింపు కేవలం కొత్త ఆదాయ పన్ను విధానం ఎంచుకున్న వారికే అని కేంద్రం మెలిక పెట్టింది. 

కొత్త ఆదాయ పన్నుకు ప్రచారం కల్పించే నేపథ్యంలో కేంద్రం పాత పన్నువిధానం ఎంచుకున్న వారికి ఎలాంటి రాయితీలు ప్రకటించకుండా షాక్ ఇచ్చింది. పాత పన్ను విధానం హెచ్ఆర్ఏ వంటి ఆదాయాలపై పన్ను మినహాయింపునిచ్చారు. వివిధ పన్ను రాయితీ పెట్టుబడుల్లో ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు పన్ను మినహాయింపును పొందడానికి లాభదాయక మార్గాల్లో ఒకటిగా ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు. సెక్షన్ 80 ఈఈబీ కింద ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలుకు తీసుకున్న రుణానికి తిరిగి వడ్డీ చెల్లించడం కోసం పన్ను మినహాంపును క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇలా పన్ను మినహాయింపు క్లెయిమ్ చేయాలంటే 1 ఏప్రిల్ 2019 నుంచి 31 మార్చి, 2023 మధ్య రుణం తీసుకోవాలి. 2019 బడ్జెట్‌లో ప్రకటించిన ఈ రాయితీ ఇప్పటికీ వర్తిస్తుంది. ఈ సెక్షన్ కింద రాయితీ వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు వర్తిస్తుంది. అలాగే కొనుగోలు చేసిన ఈవీ వాహనాన్ని వ్యక్తిగతంగా లేదా వ్యాపారపరంగానూ వినియోగించుకోవచ్చు. అలాగే 2023-24 బడ్జెట్ కేంద్రం ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే లిథియం బ్యాటరీల కస్టమ్ డ్యూటీను 21 శాతం నుంచి 13 శాతానికి తగ్గించారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి