Salary growth: ఉద్యోగం చేయాలంటే ఈ నగరమే బెస్ట్.. ముంబై, ఢిల్లీలో కంటే ఎక్కువ వేతనం

|

Oct 27, 2024 | 7:30 PM

చదువు పూర్తయిన తర్వాత దాదాపు అందరూ తమ డిగ్రీ పట్టాలను చేతపట్టుకుని ఉద్యోగాల వేటకు బయలుదేరతారు. చదువుకు తగిన ఉద్యోగం, మంచి జీతం కోసం ఎదురు చూస్తుంటారు. కొందరు సొంత గ్రామాలలో వ్యవసాయం, వ్యాపారం చేసుకున్నప్పటికీ ఎక్కువ మంది జీవనోపాధి కోసం వలస బాట పడతారు. ముఖ్యంగా సమీపంలోని నగరాలకు పయనమవుతారు. అక్కడ ఉన్న అవకాశాలను అందుకుని జీవితంలో ముందుకు సాగడానికి ప్రయత్నిస్తారు.

Salary growth: ఉద్యోగం చేయాలంటే ఈ నగరమే బెస్ట్.. ముంబై, ఢిల్లీలో కంటే ఎక్కువ వేతనం
Salary Hike
Follow us on

ఏదైనా కంపెనీలో ఉద్యోగంలో చేరిన వారికి ముందుగా కనీస వేతనాలను అందిస్తారు. ఆ తర్వాత పనితీరు, సంస్థ నిబంధనల మేరకు జీతం పెరుగుదల ఉంటుంది. అయితే దేశంలోని ఏ నగరాల్లో కనీస వేతనాలు బాగున్నాయో, ఏఏ రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయో తెలుసుకుందాం. ఇటీవల వెల్లడైన ఓ నివేదిక ప్రకారం ఉద్యోగ అవకాశాలు, జీతాల పెరుగుదల విషయంలో బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ ఏడాదికి 9.3 శాతం చొప్పున పెరుగుదల కనిపిస్తోంది. సాంకేతికంగా, వ్యాపార పరంగా, ఉద్యోగాల కల్పనలోనూ దూసుకుపోతోంది. ఈ నగరంలో కనీస వేతనంగా రూ.29,500 అందిస్తున్నారు. దేశంలోనే అత్యధిక కనీస వేతనాలు అందించే నగరంలో బెంగళూరు ప్రసిద్ధి చెందింది.

ఉద్యోగాల విషయంలో చెన్నై 7.50 శాతం, ఢిల్లీ 7.30 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేశాయి. చెన్నైలో 24,500, ఢిల్లీలో 27,800ను నెలవారీ కనీస వేతనంగా అందిస్తున్నారు. అలాగే ముంబై, పూణేలు కూడా స్థిరమైన జీతాల పెరుగుదల కనిపిస్తోంది. ముంబై లో రూ.25,100, పూణేలో రూ.24,700ను సగటు జీతంగా చెల్లిస్తున్నారు. ఈ నగరాల్లో వృద్ధి రేటు 4 నుంచి 10 శాతం వరకూ ఉంది. రిటైల్ రంగంలో జీతాల పెరుగుదల వేగంగా జరుగుతోంది. దాదాపు 8.4 శాతంలో అత్యధికంగా నమోదు అవుతోంది. ఆ తర్వాత స్థానాల్లో లాజిస్టిక్స్, ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్, ఫార్మా, కన్ స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేట్ రంగాలు పయనిస్తున్నాయి. వీటిలో నైపుణ్యం కలిగిన ఉద్యోగాలకు ఎంతో డిమాండ్ ఉంది.

అత్యధిక కనీస జీతాలు చెల్లించే పరిశ్రమలలో టెలికమ్యూనికేషన్స్ తయారీ (రూ.29,200), ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫాస్ట్రక్చర్ (రూ.28,200), హెల్త్ కేర్ అండ్ ఫార్మా (రూ.27,600), కన్ స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ (రూ.27 వేలు) వరుస స్థానాలలో నిలిచాయి. గత ఐదేళ్లలో జీతాల పెరుగుదల స్థిరంగా ఉన్న ఉద్యోగాలను కూడా నివేదికలో వివరించారు. వీటిలో ఎఫ్ఎంసీజీ పరిశ్రమ ముందంజలో ఉంది. ట్రైనీ అసోసియేట్లు 9.5, పైలట్ ఆఫీసర్లు 8, హెచ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ లు 7.9, సేల్స్ మేనేజర్లు 6.6 శాతం వృద్ధిని నమోదు చేశారు. దేశంలో పెరుగుతున్న ఉద్యోగాల కల్పనకు ఈ లెక్కలు అద్దం పడుతున్నాయి. ఆయా పరిశ్రమలు ప్రగతిపథంలో పయనిస్తున్నాయి. ఉద్యోగంలో చేరిన వారికి కనీస వేతనంగా గరిష్ట మొత్తాలను అందిస్తుండడం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి