దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త పథకాలను అందిస్తూనే ఉంటుంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా బ్యాంకు అన్ని పథకాలను ప్రారంభిస్తుంది. చాలా మంది తమ డబ్బును భవిష్యత్తులో ఏకమొత్తంలో పొందే విధంగా పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు. మరోవైపు, కొందరు వ్యక్తులు తమ పదవీ విరమణ అనంతరం ప్రతి నెలా స్థిరమైన మొత్తాన్ని పొందే విధంగా పెట్టుబడి పెట్టాలని కోరుకుంటారు. దానిని వారు పెన్షన్ గా వాడుకోవాలి అనుకుంటారు. కస్టమర్లు SBI యాన్యుటీ డిపాజిట్ పథకం ద్వారా ఈ సదుపాయం పొందే వీలుంది. ఈ పథకంలో, కస్టమర్ ఏకమొత్తాన్ని డిపాజిట్ చేయాలి. నిర్ణీత వ్యవధి తర్వాత నెలవారీ రూపంలో హామీ ఆదాయం పొందవచ్చు.
SBI ఈ పథకంలో, కస్టమర్‌కు ప్రతి నెలా అసలు మొత్తంతో పాటు వడ్డీ కూడా పొందవచ్చు. ఈ వడ్డీ ఖాతాలో మిగిలిన మొత్తంపై ప్రతి త్రైమాసికంలో కలిపి లెక్కిస్తారు. ఈ పథకంలో, బ్యాంకు టర్మ్ డిపాజిట్ అంటే FDతో సమానంగా వడ్డీ లభిస్తుంది. మరోవైపు, కస్టమర్ SBI ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో డబ్బును పెట్టుబడి పెడితే, అతనికి బ్యాంక్ నిర్దేశించిన కాల వ్యవధి ప్రకారం మెచ్యూరిటీ తేదీలో మెచ్యూరిటీ మొత్తంపై వడ్డీతో పాటు మొత్తం ఇస్తారు.
SBI కు చెందిన ఈ పథకంలో, డిపాజిట్ చేసిన తర్వాతి నెలలో గడువు తేదీ నుండి యాన్యుటీ చెల్లిస్తుంది. ఆ తేదీ ఏ నెలలో (29, 30, 31) లేకుంటే, తర్వాతి నెల తేదీలో యాన్యుటీ అందుతుంది. TDS కట్ చేస్తారని గమనించాలి,మీ బ్యాంకులో లింక్ చేసిన సేవింగ్స్ అకౌంట్ లో ఈ యాన్యుటీ చెల్లిస్తుంది.
SBI వెబ్‌సైట్ ప్రకారం, ఈ పథకంలో 36, 60, 84 లేదా 120 నెలల పాటు డిపాజిట్లు చేయవచ్చు. ఈ పథకం SBI అన్ని శాఖలలో అందుబాటులో ఉంది. ఇందులో గరిష్ట డిపాజిట్ పరిమితి లేదు. కాగా, కనీస వార్షికాదాయం నెలకు రూ. 1000 ఉండాలి. ఇందులో వినియోగదారునికి యూనివర్సల్ పాస్‌బుక్ కూడా జారీ చేస్తారు. భారతీయ పౌరులు ఎవరైనా ఈ ఖాతాను తెరవవచ్చు. మైనర్‌కు ఈ పథకం సౌకర్యం లభిస్తుంది. ఈ ఖాతాను సింగిల్ లేదా జాయింట్ మోడ్‌లో తెరవవచ్చు.
మరిన్ని బిజినెస్ సంబంధిత వార్తల కోసం