Indian Railways: మీరు ఎక్కవల్సిన ట్రైన్‌ మిస్‌ అయితే అదే టికెట్‌పై వేరే ట్రైన్‌లో ప్రయాణించవచ్చు.. ఎలాగంటే..

|

Mar 17, 2023 | 2:51 PM

ట్రాఫిక్‌ వల్లనో.. దారిలో మరేదైనా అనుకోని సమస్య తలెత్తడంవల్లో.. ఒక్కోసారి రైల్వే స్టేషన్‌కి సమయానికి చేరుకోలేకపోతాం. ఫలితంగా మనం ఎక్కవల్సిన ట్రైన్‌ మిస్‌ అవుతుంది. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో ఎదురయ్యే అనుభవమే ఇది. మరి అలాంటి పరిస్థితిలో..

Indian Railways: మీరు ఎక్కవల్సిన ట్రైన్‌ మిస్‌ అయితే అదే టికెట్‌పై వేరే ట్రైన్‌లో ప్రయాణించవచ్చు.. ఎలాగంటే..
Indian Railways
Follow us on

ట్రాఫిక్‌ వల్లనో.. దారిలో మరేదైనా అనుకోని సమస్య తలెత్తడంవల్లో.. ఒక్కోసారి రైల్వే స్టేషన్‌కి సమయానికి చేరుకోలేకపోతాం. ఫలితంగా మనం ఎక్కవల్సిన ట్రైన్‌ మిస్‌ అవుతుంది. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో ఎదురయ్యే అనుభవమే ఇది. మరి అలాంటి పరిస్థితిలో అదే రైలు టికెట్‌పై మరో ట్రైన్ ఎక్కొచ్చా అనే సందేహం కలుగుతుంది. ఐతే అందుకు ఇండియన్‌ రైల్వే కొన్ని నియమనిబంధనల్ని రూపొందించింది. రైలు టికెట్లు బుక్ చేయడం, టికెట్ క్యాన్సిల్ చేసుకోవడం, రీఫండ్ పొందడం వంటి విషయాలు అందులో పొందుపరిచారు. అలాగే ట్రైన్‌ మిస్ అయినప్పుడు అదే టికెట్‌తో మరో రైలులో ప్రయాణించే వెసులుబాటు ఉందో లేదో కూడా ఇండియన్‌ రైల్వే స్పష్టంగా అందులో పేర్కొంది.

భారతీయ రైల్వే నియమనిబంధనల ప్రకారం ముందుగా సీటు రిజర్వ్ చేసుకున్నట్లైతే తప్పనిసరిగా అదే ట్రైన్‌లో ప్రయాణించవల్సి ఉంటుంది. ఒకవేళ ట్రైన్‌ మిస్‌ అయితే తర్వాత వచ్చే ట్రైన్‌లో ప్రయాణించే వెసులుబాటు లేదు. చార్ట్‌ ప్రిపేరైన తర్వాత క్యాన్సిల్‌ చేసుకున్నా.. ట్రైన్‌ మిస్‌ అయినా రిఫండ్‌ చేసుకోవడానికి అనర్హులు. ఐతే పలానా సమయానికి వచ్చే ట్రైన్‌లో ప్రయాణించడానికి జనరల్ కంపార్ట్‌మెంట్‌ టికెట్ తీసుకుని, ఆ రైలులో ఎక్కలేకపోతే, తర్వాత వచ్చే మరో ట్రైన్‌లో ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. ఐతే ఏ రోజైతే టికెట్‌ తీసుకున్నారో ఆ రోజుకు మాత్రమే ఈ వెసులుబాటు వర్తిస్తుంది. ఉదాహరణకు సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి గుంటూరుకు బయల్దేరే ట్రైన్‌కు జనరల్‌ టికెట్‌ కొన్నారనుకోండి.. ఆ ట్రైన్‌ మిస్‌ అయితే ఆ తర్వాత అదే రూట్లో వెళ్లే మరో ట్రైన్‌లో జనరల్‌ బోగీలో ప్రయాణించవచ్చన్నమాట. అంటే ఈ వెసులుబాటు జనరల్‌ టికెట్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఛార్టింగ్ స్టేషన్ నుంచి రైలు బయల్దేరిన గంటలోగా టికెట్ డిపాజిట్ రిసిప్ట్ తీసుకుంటే మీకు రీఫండ్ వస్తుంది

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.