Business Idea : మహిళలూ.. కేవలం 3 వేలతో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఈ కోర్సు నేర్చుకుంటే నెలకు రూ.1 లక్ష పక్కా..

| Edited By: Ravi Kiran

Mar 22, 2023 | 7:00 AM

నేటి మహిళలు ప్రతి రంగంలో రాణిస్తున్నారు. కానీ నేటికి మహిళలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. చదువుకుని ఉద్యోగాలు చేయాలనుకునే మహిళలు ఉన్నారు. అయినప్పటికీ పెళ్లి, పిల్లలు, కుటుంబ బాధ్యతలతో ఇంటికే పరిమితమవుతున్నారు.

Business Idea : మహిళలూ.. కేవలం 3 వేలతో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఈ కోర్సు నేర్చుకుంటే నెలకు రూ.1 లక్ష పక్కా..
Business Idea
Follow us on

నేటి మహిళలు ప్రతి రంగంలో రాణిస్తున్నారు. కానీ నేటికి మహిళలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. చదువుకుని ఉద్యోగాలు చేయాలనుకునే మహిళలు ఉన్నారు. అయినప్పటికీ పెళ్లి, పిల్లలు, కుటుంబ బాధ్యతలతో ఇంటికే పరిమితమవుతున్నారు. అలాంటి మహిళల కోసం మేము మంచి వ్యాపారం గురించి చెప్పబోతున్నాం. ఇంటి వద్దే ఖాళీగా ఉండి సంపాదించాలనుకునే మహిళలకు ఇది ప్రత్యేకం. ఈ వ్యాపారానికి ఒక రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అసలే లేదు. కాస్త సమయం కేటాయిస్తే చాలు. ప్రతి నెలా వేలల్లో ఆదాయం సంపాదించవచ్చు.

అలాంటి వ్యాపార ఆలోచనే ఫ్యాషన్ డిజైనింగ్. ప్రస్తుతం మార్కెట్లో దీనికి చక్కటి అవకాశం ఉంది. చాలామంది డిజైనర్ దుస్తువులను ధరించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మీరు కూడా ఫ్యాషన్ డిజైనింగ్ చేసినట్లయితే చక్కటి ఆదాయం పొందవచ్చు. ముఖ్యంగా మ్యారెజ్, ఇతర ఫంక్షన్లకు ఫ్యాషన్ డిజైనర్లను ఆశ్రయిస్తుంటారు. దీన్నే మీరు వ్యాపార అవకాశంగా మార్చుకుంటే. ఈ ఐడియా చక్కగా ఉంది కదూ.

ఇక ఫ్యాషన్ డిజైనింగ్ అనేగానే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు గుర్తుకువస్తాయి. లక్షలాది ఫీజులు చెల్లించాలి. అలాంటి భయం అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం తక్కువ ధరకే సెట్విన్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు అందిస్తోంది. ఈ ఫ్యాషన్ డిజైనింగ్ సర్టిఫికేట్ కోర్సులు నేర్చుకుంటే మీరు స్వంతంగా బొటిక్ పెట్టుకోవచ్చు. దీంతో చక్కటి ఆదాయం పొందవచ్చు. FASHION DESIGNING, ADVANCED FASHION DESIGNING కోర్సులను సెట్విన్ డిజైన్ కోర్సులో భాగంగా ఆఫర్ చేస్తున్నారు. ఇక ఫీజు విషయానికొస్తే కేవలం మూడు వేలు చెల్లిస్తే సరిపోతుంది. కోర్సు వ్యవధి కూడా మూడు నెలలు మాత్రమే. ఈ కోర్సు నేర్చుకోవాలంటే చదవుతు సంబంధం లేదు. పదోతగరతి ఫెయిల్ అయిన పర్వాలేదు.

ఇవి కూడా చదవండి

ఈ సర్టిఫికేట్ కోర్సు ద్వారా మీరు బ్రాండెడ్ బోటిక్ షాపుల్లో కూడా ఉద్యోగం పొందవచ్చు. అంతేకాదు మీరు స్వంతగా బొటిక్ ను తెరవవచ్చు. సినీఇండస్ట్రీలో కూడా ఫ్యాషన్ డిజైనర్లకు చాలా డిమాండ్ ఉంది. విదేశాల్లోనూ ఈ కోర్సు చేసినవారికి మంచి అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో పలు గార్మెంట్ సంస్థలు ఫ్యాషన్ డిజైనర్లను నియమించుకుంటున్నారు. వీరికి లక్షల్లో జీతాలు కూడా ఆఫర్ చేస్తున్నారు.

ఇక ఈ కోర్సును ఆఫర్ చేస్తున్న సెట్విన్ సంస్థ తెలంగాణ సర్కార్ నియంత్రణలో ప్రభుత్వ సొసైటీగా 1978లో స్థాపించారు. నిరుద్యోగ యువత, నిరుపేద మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు కూడా ఉపాధి అవకాశాలను పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం.. క్లిక్ చేయండి.