LIC: కస్టమర్లు అలర్ట్‌.. మీరు ఎల్‌ఐసీ పాలసీని తీసుకున్నారా.? అయితే ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండండి..!

|

Aug 14, 2021 | 5:59 PM

Life Insurance Corporation: మోసాలను నిరోధించేందుకు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) ఎప్పటికప్పుడు తన వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. కొందరు..

LIC: కస్టమర్లు అలర్ట్‌.. మీరు ఎల్‌ఐసీ పాలసీని తీసుకున్నారా.? అయితే ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండండి..!
Lic
Follow us on

Life Insurance Corporation: మోసాలను నిరోధించేందుకు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) ఎప్పటికప్పుడు తన వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. కొందరు ఎల్‌ఐసీ నుంచి కాల్‌ చేస్తున్నామంటూ వినియోగదారులు తప్పుదోవ పట్టిస్తున్నారు. కొంత మంది మోసగాళ్లు ఎల్‌ఐసీ అధికారులు, ఏజెంట్‌, బీమా పాలసీకి సంబంధించిన ప్రయోజనాలను ఉన్నాయంటూ కస్టమర్లకు ఫోన్‌ కాల్స్‌ వస్తుండటంపై ఎల్‌ఐసీ వినియోగదారులను అప్రమత్తం చేస్తోంది. ఇలాంటి కాల్స్‌పై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది ఎల్ఐసీ సంస్థ.

ఫోన్‌లో వ్యక్తిగత వివరాలు చెప్పవద్దు..

వినియోగదారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కోరుతోంది ఎల్‌ఐసీ. వినియోగదారులు ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని ఫోన్‌లో ఎవరితోనూ పంచుకోకూడదని సూచిస్తోంది. ఎల్‌ఐసీ నుంచి ఫోన్‌ చేస్తున్నామంటూ మీ వ్యక్తిగత వివరాలు తెలుసుకుని మోసాలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. ఎవరికైనా మోసపూరిత ఫోన్‌ కాల్స్‌ వస్తే spuriouscalls@licindia.comకు ఇమెయిల్‌ చేయాలని ఎల్‌ఐసీ సూచిస్తోంది.

ఎల్‌ఐసీ నుంచి గుర్తింపు ఉన్న ఏజెంట్ల నుంచే పాలసీలు చేయండి:

కస్టమర్ల కోసం పలు హెచ్చరికలను జారీ చేసింది ఎల్‌ఐసీ సంస్థ. ఎల్‌ఐసీ నుంచి అంటూ ఎవైనా తెలిని నెంబర్ల నుంచి ఫోన్‌ కాల్స్‌ వస్తి వ్యక్తిగత వివరాలు, ఖాతాకు సంబంధించిన వివరాలు చెప్పవద్దని సూచిస్తోంది. అయితే ఐఆర్‌డీఏ జారీ చేసిన లైసెన్స్‌ లేదా ఎల్‌ఐసీ ద్వారా జారీ చేయబడిన గుర్తింపు కార్డు ఉన్న ఏజెంట్ల నుంచి మాత్రమే పాలసీలను కొనుగోలు చేయాలని తెలిపింది. కస్టమర్లను మోసం చేసేందుకు ఫోన్‌ కాల్స్‌ వస్తే ఎల్‌ఐసీ వెబ్‌సైట్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చని, అలాంటి నెంబర్లను పరిశీలిస్తామని చెబుతోంది.

పెరుగుతున్న మోసాలు:

కాగా, ఎల్‌ఐసీ నుంచి అనే కాకుండా ఎస్‌బీఐతో పాటు ఇతర బ్యాంకుల నుంచి ఫోన్‌లు చేస్తున్నామని వినియోగదారుల వ్యక్తిగత వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు మోసగాళ్లు. బ్యాంకుల విషయాలలో కస్టమర్లకు ఫోన్‌లు చేస్తూ వివరాలు తెలుసుకుంటున్నారు. అలా వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతాకు సంబంధించిన వివరాలు చెప్పిన వారు నిలువునా మోసపోతున్నారు. జరిగిన మోసాన్ని తెలుసుకుని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి ఆన్‌లైన్‌ మోసాలు జరుగుతుండటంతో ఎస్‌బీఐ, ఇతర బ్యాంకులను కస్టమర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. బ్యాంకుల నుంచి ఎవరు కూడా ఫోన్‌లు చేస్తూ వ్యక్తిగత వివరాలు, ఆధార్‌ నెంబర్‌, పాన్‌ నెంబర్‌, బ్యాంకుకు సంబంధించిన వివరాలు అడగరని, తొందరపడి వివరాలు చెబితే మీ బ్యాంకు ఖాతా ఖాళీ అవుతుందని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి బ్యాంకులు. అందకే కస్టమర్లు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండటం బెటర్‌. లేకపోతే మోసపోయే అవకాశం ఉంది.

పోలీసుల నిఘా

అయితే మోసాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా పెంచారు. ఆన్‌లైన్‌ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో టెక్నాలజీ ద్వారా ముఠా సభ్యులను గుర్తించి అరెస్టు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. ఎలాంటి కాల్స్‌ వచ్చినా జాగ్రత్తగా ఉంటూ ఎట్టి పరిస్థితుల్లో పూర్తి వివరాలు చెప్పవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

ఇవీ కూడా చదవండి

Bank FD: ఈ బ్యాంకు మూడు సంవత్సరాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధిక శాతం వడ్డీ.. ఆగస్టు 16 వరకు అవకాశం..!

RBI News: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. బ్యాంకు లైసెన్స్‌లు రద్దు.. ఆ మూడు బ్యాంకులకు భారీ జరిమానా

Jewellery Online Order: ఆన్‌లైన్‌లో నగలు కొనుగోలు చేస్తున్నారా..? ఇవి తప్పకుండా తెలుసుకోండి.!