Business Ideas : ఉన్న ఊరిలోనే గవర్నమెంటు ఉద్యోగి కన్నా ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం..ఏం వ్యాపారం చేయాలంటే..?

ఉద్యోగం లభించడం లేదని నిరాశలో కోరుకుపోతున్నారా? అయితే ఏమాత్రం నిరాశ చెందకండి. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి.

Business Ideas : ఉన్న ఊరిలోనే  గవర్నమెంటు ఉద్యోగి కన్నా ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం..ఏం వ్యాపారం చేయాలంటే..?
Business ideas

Edited By:

Updated on: Jun 05, 2023 | 9:51 AM

ఉద్యోగం లభించడం లేదని నిరాశలో కోరుకుపోతున్నారా? అయితే ఏమాత్రం నిరాశ చెందకండి. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. వీటిని ఉపయోగించుకొని మీరు చక్కటి బిజినెస్ అవకాశాలను పొందే వీలుంది. మీరు బిజినెస్ చేయాలి అనుకుంటే వ్యవసాయ రంగంలోనే చక్కటి ఆదాయం పొందే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాంటి ఓ చక్కటి బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మీ వద్ద ఎకరం నుంచి రెండు ఎకరాలు పొలం ఉన్నట్లయితే, కూరగాయల సాగు చేయడం ద్వారా చక్కటి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. మీ వ్యవసాయ క్షేత్రం నగరానికి దగ్గరగా ఉన్నట్లయితే చాలా మంచిది అప్పుడు మీ కూరగాయలను నేరుగా కష్టమర్లకే విక్రయించవచ్చు. తద్వారా మీరు ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంది.
ఉదాహరణకు మీ వద్ద ఒక ఎకరం విస్తీర్ణం ఉన్నట్లయితే పావు ఎకరం విస్తీర్ణంలో ఒక పంట చొప్పున నాలుగు రకాల పంటలను పండించవచ్చు. తద్వారా మీరు స్థిరంగా ఆదాయం పొందే అవకాశం ఉంది. అంటే పావు ఎకరంలో టమాటా పంట వేసినట్లయితే, మరో పావు ఎకరంలో పచ్చిమిరపకాయలు, మరో పావు ఎకరంలో కొత్తిమీర, మిగిలిన పావు ఎకరంలో మరో కూరగాయ పంటను వేసుకోవచ్చు.తద్వారా మీరు ఆ కూరగాయలను నగరంలో నేరుగా విక్రయించడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. మధ్య దళారీలకు విక్రయిస్తే మీరు నష్టపోయే అవకాశం ఉంది.

సీజన్ ను బట్టి పంటలు మారుస్తూ కూరగాయలను విక్రయించినట్లయితే చాలా మంచి లాభం లభిస్తుంది.  మీ వద్ద ఒక ఎకరం కన్నా ఎక్కువ భూమి ఉన్నట్లయితే కూడా ఈ పద్ధతిలోనే వ్యవసాయం చేసినట్లయితే చక్కటి ఆదాయం పొందవచ్చు. అంతేకాదు మీ భూమిలోనే కొంత పశువుల కొట్టం ఏర్పాటు చేసి. పాలను కూడా విక్రయించడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇక మీరు నగరంలో కూరగాయలను విక్రయించాలి అనుకుంటే ఓ కమర్షియల్ ట్రక్ కొనుగోలు చేసుకుంటే మంచిది. నగరాల్లో ఈ మధ్యకాలంలో వీధుల్లో సాయంత్రం వేళ సంతలను ఏర్పాటు చేసి కూరగాయలను విక్రయిస్తున్నారు. మీరు కూడా ఈ సంతల్లో నేరుగా కూరగాయలు విక్రయించడం ద్వారా చక్కటి లాభం పొందే అవకాశం ఉంది.

తాజా కూరగాయలను నేరుగా పొలం నుంచి తీసుకుని వచ్చి నిల్వ చేయకుండా విక్రయిస్తే కస్టమర్లు కచ్చితంగా ఇష్టపడతారు. వీలుంటే నగరంలోనే ఓ షాపు ఏర్పాటు చేసుకొని కూరగాయలను వ్యవసాయ క్షేత్రం వద్ద ప్యాకింగ్ చేసుకొని షాపులో విక్రయించినట్లయితే, మరింత లాభం పొందే అవకాశం ఉంది. అప్పుడు ఆ షాపులో మీ వ్యవసాయ క్షేత్రంలోని కూరగాయలతో పాటు, ఇతర వ్యవసాయ క్షేత్రంలోని కూరగాయలను కూడా సమీకరించి విక్రయించినట్లయితే చాలా లాభం పొందే అవకాశం ఉంది. సాధారణంగా షాపుకు వచ్చి కొనుగోలు చేసే కస్టమర్లతో పాటు. హోటల్స్, కర్రీ పాయింట్స్, హాస్టల్స్ కు రెగ్యులర్ సప్లయర్ గా ఉన్నట్లయితే మరింత ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంది. అలాగే నిరంతరం ఆర్డర్లు సైతం పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ సంబంధిత వార్తల కోసం…