ICICI Bank Alert: ఐసీఐసీఐ అలర్ట్.. ఆగస్టు నుంచి మారనున్న సర్వీస్ ఛార్జీలు.. వివరాలు..

|

Jul 28, 2021 | 8:13 PM

ICICI Bank Service Charges: ఐసీఐసీఐ బ్యాంక్ స‌ర్వీస్ ఛార్జీలు ఆగ‌స్టు 1 నుండి మార‌నున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు వెబ్‌సైట్ ప్రకారం.. ఖాతాదారులకు 6 మెట్రో న‌గ‌రాల్లో

ICICI Bank Alert: ఐసీఐసీఐ అలర్ట్.. ఆగస్టు నుంచి మారనున్న సర్వీస్ ఛార్జీలు.. వివరాలు..
ICICI Bank Service Charges
Follow us on

ICICI Bank Service Charges: ఐసీఐసీఐ బ్యాంక్ స‌ర్వీస్ ఛార్జీలు ఆగ‌స్టు 1 నుండి మార‌నున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు వెబ్‌సైట్ ప్రకారం.. ఖాతాదారులకు 6 మెట్రో న‌గ‌రాల్లో మొద‌టి 3 లావాదేవీల ( ఆర్థిక, ఆర్థికేత‌ర ) సేవ‌లు ఉచితంగా ల‌భించనున్నట్లు వెల్లడించింది. ఐసీఐసీఐ బ్యాంకు న‌గ‌దు లావాదేవీలు, ఏటీఎం ఇంట‌ర్‌ ఛేంజ్‌, చెక్‌ బుక్ ఛార్జీలు ఆగ‌స్టు 1 నుంచి మార‌నున్నట్లు వెల్లడించింది.

సవరించిన ఛార్జీలు ఇలా..
∙ ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలల్లో నెల‌కు మొత్తం 4 ఉచిత న‌గ‌దు లావాదేవీల‌ను అనుమ‌తించింది. ప్రతి అదనపు లావాదేవీకి రుసుము వసూలు చేయనున్నారు.
∙ ఐసీఐసీఐ వినియోగ‌దారుల‌కు 6 మెట్రో న‌గ‌రాల్లో మొద‌టి 3 లావాదేవీల (ఆర్థిక, ఆర్థికేత‌ర) సేవ‌లు ఉచితంగా లభించనున్నాయి.
∙ మెట్రో న‌గ‌రాలు కాకుండా ఇతర ప్రాంతాల్లో మొద‌టి 5 లావాదేవీలు ఉచితంగా లభించనున్నాయి.
∙ బ్యాంకు ప్రతీ ఆర్థిక లావాదేవీకి రూ.20, ఆర్థికేత‌ర లావాదేవీకి రూ.8.50 వ‌సూలు చేయనుంది.
∙ హోం బ్రాంచ్‌లో న‌గ‌దు లావాదేవీ ప‌రిమితి నెలకు రూ.1ల‌క్ష వరకు ఉచితంగా ప్రకటించింది. లక్ష రూపాయలు దాటితే ప్రతి రూ.1000కి రూ.5 ఛార్జీ వసూలు చేయనుంది. ఇది క‌నిష్ఠంగా రూ.150కు లోబ‌డి ఉంటుంద‌ని బ్యాంక్ తెలిపింది.
∙ నాన్ హోమ్ బ్రాంచ్ వ‌ద్ద రోజుకు రూ.25,000 వ‌ర‌కు న‌గ‌దు లావాదేవీల‌కు ఛార్జీలు ఉండవు. రూ.25,000 పైన ప్రతీ రూ.1000కి రూ.5 ఛార్జీ వసూలు చేయనుంది. క‌నీసం రూ. 150కి లోబ‌డి ఉంటుందని ఐసీఐసీఐ బ్యాంకు వెల్లడించింది.
∙ థ‌ర్డ్‌ పార్టీ లావాదేవీల ప‌రిమితి రూ. 25,000గా నిర్ణయించారు. రోజూకు రూ.25,000 ప‌రిమితి వ‌ర‌కు లావాదేవీకి రూ.150 ఛార్జీ ఉంటుంది. రూ. 25,000 ప‌రిమితికి మించి న‌గ‌దు లావాదేవీలు అనుమ‌తించరు.
∙ ఒక నెల‌లో మొద‌టి 4 లావాదేవీల‌కు ఛార్జీలు ఉండవు. ఆ త‌ర్వాత రూ.1000 లావాదేవీకి రూ.5 ఛార్జీ వసూలు చేస్తారు. క‌నీసం రూ.150కి లోబ‌డి ఉంటుంది.
∙ ఒక సంవత్సరంలో తీసుకున్న 25 చెక్‌లున్న చెక్ బుక్‌కి ఛార్జీలు ఉండవు. ఆ త‌ర్వాత అదే ఏడాది 10 చెక్‌లున్న చెక్ బుక్ తీసుకుంటే బ్యాంక్ రూ.20 వ‌సూలు చేస్తుంది.

Also Read:

Tax Saving Tips: మీరు ట్యాక్స్ పేయర్లా.. అయితే ఇలా పన్ను మినహాయింపులు పొందండి..

EPF: మెడికల్ అవసరాల కోసం ఒక్క గంటలో మీ పీఎఫ్ ఎకౌంట్ నుంచి డబ్బు తీసుకోవచ్చు.. ఆన్‌లైన్ లోనే ఎలా అప్లై చేయవచ్చో తెలుసుకోండి!