Rent payment: ఈ కార్డుతో రెంట్‌ పే చేస్తున్నారా.? షాకింగ్ న్యూస్‌ చెప్పిన దిగ్గజ బ్యాంక్‌..

ICICI Rent payment: ప్రముఖ దిగ్గజ ప్రైవేటు రంగ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్‌ ఐసీఐసీఐ తమ కస్టమర్లకు షాకింగ్ న్యూస్‌ తెలిపింది. ఇప్పటి వరకు క్రెడిట్ కార్డులతో ఉచితంగా రెంట్‌ పేమెంట్‌ చేసుకున్న కస్టమర్లకు ఇకపై ఆ సదుపాయం ఉండదని బ్యాంక్‌ తెలిపింది...

Rent payment: ఈ కార్డుతో రెంట్‌ పే చేస్తున్నారా.? షాకింగ్ న్యూస్‌ చెప్పిన దిగ్గజ బ్యాంక్‌..

Updated on: Sep 20, 2022 | 11:28 AM

ICICI Rent payment: ప్రముఖ దిగ్గజ ప్రైవేటు రంగ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్‌ ఐసీఐసీఐ తమ కస్టమర్లకు షాకింగ్ న్యూస్‌ తెలిపింది. ఇప్పటి వరకు క్రెడిట్ కార్డులతో ఉచితంగా రెంట్‌ పేమెంట్‌ చేసుకున్న కస్టమర్లకు ఇకపై ఆ సదుపాయం ఉండదని బ్యాంక్‌ తెలిపింది. ఈ విషయమై ఐసీఐసీఐ ఇప్పటికే తన కస్టమర్లందరికీ మెసేజ్‌ల రూపంలో ఈ విషయాన్ని తెలియజేసింది. అక్టోబర్‌ 20,2022 నుంచి క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా ఇంటి అద్దె చెల్లించే లావాదేవీలపై 1% రుసుమును వసూలు చేయనున్నట్లు బ్యాంక్‌ తెలిపింది. దీంతో క్రెడిట్‌ కార్డ్‌ రెంట్‌ పేమెంట్స్‌పై చార్జీ వసూలు చేస్తున్న తొలి బ్యాంక్‌గా ఐసీఐసీఐ అవతరించింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం భారత్‌లో 11 మిలియన్లకు పైగా ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌లు ఉపయోగిస్తున్నారు. దీంతో ప్రస్తుతం క్రెడిట్ కార్డుతో పేమెంట్స్‌ చేస్తున్న వారికి అధనంగా భారం పడనుంది. ఉదాహరణకు మీరు నెలకు రూ. 12,000 ఇంటి అద్దెను చెల్లిస్తున్నారనుకుంటే.. పేమెంట్‌ ప్లాట్‌ఫామ్స్‌ 0.04 శాతం నుంచి 2 శాతం వరకు చార్జీలను వసూలు చేస్తాయి. అలాగే కార్డ్‌పై వసూలు చేసే 1 శాతంతో కలుపుకొని మొత్తం రూ. 12,241 వరకు చెల్లించాల్సి వస్తుంది. ఈ లెక్కన చూసుకుంటే కొత్త చార్జెస్‌ వల్ల కస్టమర్‌కు ఏటా రూ. 1,452 అదనపు భారం పడనుంది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే ఐసీఐసీఐతో పాటు చాలా బ్యాంక్‌లు క్రెడిట్‌ కార్డుతో అద్దె చెల్లించే అవకాశం కల్పించాయి. వీటిలో కొన్ని బ్యాంకియేతర కంపెనీలు సైతం ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి మ్యాజిక్‌బ్రిక్స్‌, మైగేట్‌, క్రెడ్‌, పేటీఎమ్‌, రెడ్‌జిరాఫి, నోబ్రోకర్‌ వంటి థర్డ్‌ పార్టీ ప్లాట్‌ఫామ్‌లు కూడా ఇలాంటి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..